Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో దొంగ ఏడుపులు ఏడుస్తున్న దేవయాని !

guppedantha manasu oct 20 prime9news

guppedantha manasu oct 20 prime9news

Guppedantha Manasu : నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

అప్పుడే దారిలో దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తుంటుంది.దానితో రిషి కారు పక్కకు ఆపుతాడు.‘నా పెద్దరికాన్ని పక్కనపెట్టి మరీ ఆ వసుధారను బ్రతిమిలాడాను.చెబుతుంటే వినట్లేదు కదా.? ఏం చేద్దాం చెప్పు’ అంటూ దేవయాని దొంగ ఏడుపు ఏడుస్తుంది. ‘పెద్దమ్మా.. వసుధార తన ధోరణి మార్చుకుని తప్పకుండా ఇక్కడికి వస్తుంది..మీరు చూసే వసుధార వేరు.. నాకు అర్థమవుతున్న వసుధార వేరు.జగతీ మేడమ్‌ మీద తనకి చాలా అభిమానం ఉంది.అంతకంటే ఎక్కువుగా నా మీద ప్రేమ ఉంది. ఎప్పటికైనా ఆ ప్రేమ గెలుస్తుంది పెద్దమ్మా.. అంటూ రిషి అంటాడు. తను ఈ ఇంటి కోడలిగా వస్తుందని రిషి నమ్ముతాడు.

రిషి..నువ్వు ఏమైనా అనుకో.. నాకైతే ఆ విషయంలో నమ్మకం లేదు’ అంటూ మళ్లీ దొంగ ఏడుపు మొదలుపెట్టి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది.‘చెప్పాను కదా పెద్దమ్మా.. ఈ ఒక్క విషయం తప్ప.. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మా ఇద్దరినీ మా ప్రేమే నిలబెట్టింది ఇప్పుడు కూడా ఆ ప్రేమే మమ్మల్ని గెలిపిస్తుంది. వసుధార ఎప్పటికైనా మన ఇంటి కోడలు అవుతుంది.. మీరు మీ మనసుని కష్టపెట్టుకుని ఎలాంటి ప్రయత్నాలు చేయకండి..’ అనేసి కారు ముందుకు పోనిస్తాడు. దేవయాని మనసులో కోపంగా రగిలిపోతుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version