Prime9

Guppedantha Manasu: రేపటి ప్రోమోలో ఓకే గదిలో వసు, రిషి సమథింగ్ సమథింగ్..!

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఎట్టకేలకు నిజం తెలుసుకున్న రిషి, వసుని కిడ్నాప్ చేయించింది సాక్షీనే అని రిషికి తెలియడంతో ఇక ఇప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి రిషి ఇంక 24 గంటలు కోపంలోనే ఉంటాడు. డైరెక్ట్‌గా పెద్దమ్మ అని కూడా లేకుండా దేవయాని ముందే రెచ్చిపోయాడు రిషి మాట్లాడేసరికి, దేవయాని షాక్ అయ్యి అలానే చూస్తుంది. అయితే నేటి ఏపిసోడులో ఎమోషనల్ సీన్ బాగా ఏడ్పించేసింది.

ఓవైపు గురుదక్షిణ విషయంలో రిషి వసుకి గడువు విధించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ‘నేను కోరుకునే సమాధానం నీ నుంచి రావాలని వసుకి కండిషన్ పెడతాడు. ధరణీకి దెబ్బ తగలడంతో, వసు రిషి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాటలు, రొమాంటిక్ గా నడుస్తాయి. ఈ సీరియల్ లేటెస్ట్ ప్రోమో చాలా ఆసక్తిగా ఉంది.

ప్రోమో హైలెట్స్ ఇవే..

వసు చూసుకోకుండా రిషి మీద జ్యూస్ పారబోసేయడంతో, ఆ డ్రెస్ మార్చి పైన టీ షర్ట్, కింద టవల్ కట్టుకుని, నైట్ ఫ్యాంట్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే చూసుకోకుండా వసు రూమ్‌లోకి వచ్చేస్తుంది. సార్, అని పిలవగానే రిషి సిగ్గు పడుతూ ఒక్క గంతు వేసి, ఇబ్బందిగా రిషి ‘హేయ్, నువ్వు అంటూ కబోర్డ్‌లోకంటూ వెళ్ళి దాక్కుకుంటాడు. కబోర్డ్ తలుపుల్ని తనకు అడ్డంగా ఉంచుకుంటాడు. అప్పుడు వెంటనే వసు తన కళ్లను మూసుకొని ‘అయ్యో, సారీ సార్’ నేనేం చూడలేదు అని అంటుంది. హేయ్ ‘వచ్చేముందు పిలవచ్చుగా, అలా డైరెక్ట్ గా వచ్చేస్తావా అని అంటాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.

ఇది చదవండి:  సెప్టెంబర్ 24 ఏపిసోడులో రెచ్చిపోతున్న మాధవ్

ఇది చదవండి: సెప్టెంబర్ 24 ఏపిసోడులో తులసి గురించే ఆలోచిస్తున్న సామ్రాట్

Exit mobile version
Skip to toolbar