Site icon Prime9

GruhaLakshmi: అక్టోబర్ 10 ఎపిసోడ్ లో పిల్లల కోసం ముడుపులు కట్టిన తులసి

gruha lakshmi 10 oct prime9news

gruha lakshmi 10 oct prime9news

GruhaLakshmi Today: నేటి గృహలక్ష్మీ  సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. అత్తయ్య మావయ్య పేరు మీద అర్చన చేయించమని తులసి పంతులికి చెప్పబోతుండగా, లాస్య అడ్డుకుని అత్తయ్య మామయ్యలకు మేం పూజ చేయిస్తున్నాం. మీ పూజ మీరు వేరుగా చేయించుకోండని అంటుంది. ఈరోజు పవిత్రమైన రోజు మనసులో కోరిక అనుకుని ముడుపు కడితే అది ఖచ్చితంగా జరుగుతుందని పంతులు చెప్పడంతో ఆ మాట విన్న లాస్య, ‘సామ్రాట్‌కి దగ్గర కావాలని ముడుపు కడుతుంది. చాన్స్ దొరికితే వదలదు’ అని అనుకుంటుంది. నాకున్న కోరిక చాలా చిన్నది. నా కోడళ్ల కడుపు పండటం. నేను మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవాలని దేవుడా అని తులసి ముడుపు కట్టగా దీంతో పంతులు శుభం అంటూ కోడళ్లతో ముడుపులు కట్టమని అంటాడు.

దీంతో తులసి కోడళ్ళు ఇద్దరికీ ముడుపులను అందిస్తుంది. ఐతే శ్రుతి ఈ ముడుపుల అవసరమా ఆంటీ, ఏది సమయంలో జరగాలని రాసి పెట్టి ఉంటే ఆ సమయంలోనే జరుగుతుందని కొత్తగా ముడుపులు కట్టడం వల్ల మనకు వచ్చేది ఏముందని అంటుంది. దీంతో అనసూయ నోరేసుకొని పడిపోతుంది. కడితే పోయేది ఏముంది. ఇంతమంది కడుతున్నారు వీళ్లంతా పిచ్చోళ్లా అని అంటుంది. చివరికి తులసి చెప్పడంతో శ్రుతి కాదనకుండా ముడుపు తీసుకుంటుంది. ఇద్దరు కోడళ్లు ముడుపులు కట్టబోతూ,‘మనసులు దూరం అయ్యాక ముడుపులు ఎలా దగ్గర చేస్తాయో మాకు తెలియదు. మా మనసులో ఉన్నది ఒకటి, మేము చేస్తున్నది ఒకటి, అనుకుంటూ ఇద్దరూ ఇస్టం లేకుండానే ముడుపులు కట్టబోతుంటారు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి : అక్టోబర్ 10 ఎపిసోడ్‌ లో దుర్గా ఎంట్రీ మామూలుగా లేదుగా!

Exit mobile version