Site icon Prime9

Gruhalakshmi: నవంబర్ 05 ఎపిసోడ్ లో అద్దె ఇల్లు చూసుకుంటున్న తులసి

Gruhalakshmi Nov 05 prime9news

Gruhalakshmi Nov 05 prime9news

Gruhalakshmi: నేటి  గృహలక్ష్మీ  ఎపిసోడ్ లో  ఈ  రెండు సీన్లు హైలెట్

తులసి  వెళ్లిపోవడంతో ఇంట్లో ఎమోషనల్ అవుతుంటారు.మరోవైపు  లాస్య….ఇంటి పత్రాలను చూసుకుని తెగ  మురిసిపోతుంది.‘తులసిని   రెచ్చగొట్టి  ఇల్లు  రాయించేశాను….అత్తయ్యని  రెచ్చగొట్టి.. తులసి మీద లేనిపోనివి చెప్పాను.. వీళ్లు  ఇప్పట్లో  కలవరు.ఈ పత్రాలను  జాగ్రత్తగా  భద్రంగా దాచిపెట్టాలని  అని  ఫిక్స్  అవుతుంది. అనుకున్నట్లే ఆ పత్రాలను జాగ్రత్తగా  దాచి పెడుతుంది. దాచి పెట్టి  వెనక్కి  తిరిగేసరికి అక్కడ  నందు  ఉంటాడు.

మరోవైపు.. మహారాణి  తులసి గారు  హ్యాండ్  బ్యాగ్  వేసుకుని.. అద్దె ఇల్లు చూడటానికి  వెళ్తూ ఉంటుంది.మొదట  ఓ ఇంటి ఓనర్….ఇల్లంతా  చూపిస్తూ ఉంటుంది.తులసికి  బాగా  నచ్చుతుంది.అడ్వాన్స్   మొదటి  జీతం  రాగానే ఇచ్చినా ఫర్వాలేదా? అని తులసి  అంటుంది. ‘ఫర్వాలేదు.. ఎవరెవరు ఉంటారని అడుగుతుంది  ఆ ఇంటి ఓనర్. ‘నేను మా అబ్బాయి.. మా అబ్బాయి  అప్పడప్పుడు వస్తూ వెళుతుంటాడు. నేను ఒక్కదాన్నే ఉంటానని తులసి   అంటుంది. ‘అదేంటీ?  మీ  భర్త?’ అని  అంటుంది ఆవిడ. ‘ఆయన నాతో ఉండరు. నేను ఒక్కదాన్ని  మాత్రమే ఈ ఇంట్లో అద్దెకు ఉంటానని ’   తులసి  అంటుంది.

Exit mobile version