Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 18 ఎపిసోడ్ లో నాకు ఇష్టం లేని పనులు నేను చేయనంటున్న తులసి?

gruhalakshmi 18 prime9news

gruhalakshmi 18 prime9news

Gruhalakshmi Today:నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. చదువు అనుభవం ఉన్న వాళ్లకంటే తులసి వెయ్యి రెట్లు బెటర్. నువ్వు చెప్పాలిసినవి తులసికి ఎక్స్‌ప్లైన్ చేసి మీటింగ్‌కి రెడీ అవ్వమని చెప్పు. ఇక్కడి నుంచి పో అని అంటాడు సామ్రాట్. నీకే కనుక పవర్ ఉండి ఉంటే, తులసిని ఏకంగా అమెరికాకి ప్రెసిడెంట్‌ని చేసేవాడని, ఛీ సామ్రాట్ దీ మరీ ఇంత చీప్ క్యారెక్టర్ నేను అనుకోలేదు అని మనసులో సామ్రాట్‌ని తిట్టుకుంటుంది. అసలు తులసిని ఇక్కడ జనరల్ మేనేజర్‌‌గా పెట్టడం ఏంటో, జాబ్ నుంచి తీసేసి, మళ్లీ ఆమెను దగ్గర పెట్టుకోవడం ఏంటో, ఇదంతా చూస్తుంటే తులసి జపంలో సామ్రాట్ ఉంటున్నారని తెలుస్తుంది.

నాకు ఇష్టం లేని పనులు నేను చేయనంటున్న తులసి

నువ్వు చెప్పినవి ‘నాకు ఇష్టం లేదు. నేను ఒప్పుకోను’ అంటూ మొదట్లో ఓవరాక్షన్ మొదలుపెడుతుంది తులసి. ‘నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ ఇష్టాలకు సామ్రాట్ గారు ఇంపార్టెంట్ ఇస్తారు. నువ్వు ఎక్కువ ఆవేశపడినా లాభం లేదు’ అని అంటుంది లాస్య. ఐనా నీతో మాట్లాడి నాకు ఏమి లాభం లేదు. సామ్రాట్ గారితోనే తేల్చుకుంటాను అంటూ సామ్రాట్ దగ్గరకు తులసి కోపంగా వెళ్తుంది. వీళ్ల నాటకాలు మాకు తెలియవా? ఇప్పుడు ఆవేశంగా వెళ్తుంది. బయటకు వచ్చేటప్పుడు కిల కిల నవ్వుకుంటూ బయటకు వస్తుంది అని లాస్య మనసులో అనుకుంటుంది.

Exit mobile version