Gruhalakshmi: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడ్లో ఈ రెండు సీన్లు హైలెట్
తులసి ఒక ఫోన్ చేసుకోవచ్చా? అని అడుగుతుంది.మా ఫోన్లలో నెట్ వర్క్ లేదు కానీ..మీ ల్యాండ్ లైన్ నుంచి ఒక ఫోన్ చేసుకుంటానని అంటుంది.వెళ్ళి చేసుకోండని అంటారు.దీంతో తులసి…ఇంటికి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి , తులసి మాట వినపడేసరికి ప్రేమ్ కు ప్రాణం లేచి వస్తుంది. భజన మాస్టర్ పరందామయ్య ఐతే తెగ కంగారు పడిపోతుంటాడు.‘కంగారు పడొద్దు మామయ్యా…ఇక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది..ఫోన్లో సిగ్నల్ పోయింది.నేను ఒక ఇంట్లో ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నా…అలాగే ఒక ముఖ్యమైన విషయం పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాం.. దేవుడి దయ వల్ల మాకు ఏ ప్రమాదం జరగలేదు..కారు కూడా దారిలో ఆగిపోయింది.ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ కొంతమంది పిల్లలు బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. మేం కూడా వాళ్ల దగ్గరే ఉన్నాం’ అని క్షేమ సమాచారాన్ని అందిస్తుంది తులసి.
ఇంతలో ఫోన్ కట్ అయిపోతుంది.మళ్ళీ ఎంత ప్రయత్నించినా లైన్ కలవదు.ఇక సామ్రాట్ ఐతే మీరు ఇంక కంగారు పడకండి ఇంటికి ఫోన్ చేశారు కదా…కూల్ గా ఉండండి.అలా తులసికి ధైర్యం చెప్తాడు సామ్రాట్.ఇక తులసి ఐతే పార్టీలో ఉన్న యువతీ యువకుల్ని చూసి..ఇక్కడి పిల్లలు ఎంత పద్దతిగా ఉన్నారో..వాళ్లని డిస్ట్రబ్ చేయకూడదు.ఆంటీ అంకుల్ ముందు పార్టీ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.. అందుకే మనం సెపరేట్గా ఉందాం అని అంటుంది తులసి.