Site icon Prime9

Gruhalakshmi: సెప్టెంబర్ 24 ఏపిసోడులో తులసి గురించే ఆలోచిస్తున్న సామ్రాట్

gruha lakshmi 24 prime9news

gruha lakshmi 24 prime9news

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్, తులసి అందరికీ మంచిగా మెలగడం చూసిన సామ్రాట్ పొంగిపోతాడు. అదే సమయంలో నందు, లస్యలు ఈ కర్మ ఏంట్రా బాబూ తల పట్టుకొని ఒకరికోకరు చూసుకుంటూ ఉంటారు. ఇక సామ్రాట్ అయితే తులసిని చూస్తూ ‘తులసి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. అందరి మంచి కోరుకుంటుంది కానీ ఎందుకు బాబాయ్ తులసికి దేవుడు ఇంత అన్యాయం చేశాడని బాధ పడుతుంటాడు. తనకి ఈ ఒంటరి బతుకు ఏంటి? అని చుట్టూ కొడుకులు కోడళ్లు అందరూ ఉన్నారు. వాళ్ళ భర్త తప్ప. సామ్రాట్ ఇలా తులసి భర్త గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెది ఒంటరి బతుకు అని తెగ ఫీల్ అవుతుంటాడు సామ్రాట్. ఆ మాటలన్ని విన్న బాబాయ్ నాకూ అదే అనిపిస్తుందిరా అబ్బాయ్. నీడనిచ్చిన చెట్టుకు ఇప్పుడు నీడలేకుండా చేశారని ఇద్దరూ తులసి గురించి బాధ పడుతుంటారు.

తులసి గురించి బాధ పడుతున్న సామ్రాట్..

నందు తులసిని వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. తులసి కూడా తన భర్త చేసిన పనే చేసి ఉంటే బావుండేదని సామ్రాట్ అభిప్రాయపడ్డాడు. మగాళ్లు బంధాలు తెంచుకున్న సులువుగా ఆడవాళ్ళు బంధాలను తెంచుకోలేరురా. చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని ధైర్యంగా నిర్ణయం కూడా తీసుకునేల ఉండవు. కనీసం ఒక్కరైనా తులసికి ధైర్యం చెప్తే, తులసి అలా చేసేదేమో అని అనుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్లిద్దరి ఆలోచన ఏంటంటే 50 ఏళ్లు వారిని చూసి తులసికి పెళ్లి చేయాలని ఆలోచిస్తునట్లు తెలుస్తుంది. నందు వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో నందు అంతా వెధవ ఎవరు లేనట్టు ఈ సీరియల్‌లో చూపిస్తారు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

Exit mobile version