Site icon Prime9

GruhaLakshmi: అక్టోబర్ 07 ఎపిసోడులో తులసి ఇంటికి వెళ్ళినా సామ్రాట్

gruha lakshmi 07 oct prime9news

gruha lakshmi 07 oct prime9news

GruhaLakshmi Today: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. తులసి విషయంలో సామ్రాట్ చేసిన తప్పుకి క్షమాపణ ఐనా చెప్పమని వాళ్ల బాబాయ్ అనడంతో సామ్రాట్ దానికి సరేనని తులసి ఇంటికి బయలుదేరతాడు. ఇంకో వైపు దసరా ఉత్సవాల్లో భాగంగా, చుట్టూ పక్కల వాళ్లంతా కలసి దసరా పండుగకు తులసి ఫ్యామిలీని ఆహ్వానిస్తారు. కాలనీలో పెద్ద దిక్కుగా ఉన్న అనసూయ చేతుల పై ఈ పండుగ వేడుకలను నిర్వహించాలని, కాలనీ మహిళా ప్రెసిడెంట్ వచ్చి తులసి ఇంటి వద్దకు వచ్చి అడగడంతో తులసి ఫ్యామిలీ దసరా ఉత్సవాలకు వెళ్ళాలని సిద్ధపడిపోతుంటారు.

తులసి ఇంటికి వెళ్ళినా సామ్రాట్..

ఇంతలో సామ్రాట్ రావడం చూసిన అనసూయ వెంటనే అతని దగ్గరకు వెళ్తుంది. సామ్రాట్ ఎందుకు వచ్చాడు. ఇక్కడికి ‘నాకోసం వచ్చాడా? తులసి కోసం వచ్చాడా? అని మనసులో అనుకుంటుంది అనసూయ. సామ్రాట్ దగ్గరకు వెళ్లి, ‘నా కుటుంబం కోసమే ఇలాంటి పని చేశాను బాబూ, తులసి మొహం చూసినప్పుడల్లా దోషిలా నేను తల వంచుకుంటున్నాను. నాకు తప్పడం లేదు బాబూ’ అని అనసూయ అంటుంది.

సామ్రాట్ మనసులో ఈ విధంగా తులసి గురించి ఆలోచిస్తూ ‘తులసిని కలుద్దాం అని వస్తే, ఈమె ఏంటి నన్ను గుమ్మంలోనే ఆపేసింది. నేను ఇప్పుడు తులసిని ఎలా కలవాలి. ఆమె దగ్గరకు వెళ్ళి సారీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఇంతలో అనసూయ, ఇప్పటికే మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు. నాకు మీరు మరో సాయం కూడా చేయాలి. ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. తులసి ఉద్యోగం మనమే తీయిచాం అని ఎవరికి తెలియకూడదు. ఇక నుంచి తులసి మీ ఇంటికి కానీ, మీ ఆఫీసు కూడా రాదు. మీరు కూడా మా ఇంటికి రాకుండా ఉంటే చాలా మంచిది. తులసితో మీరు మాట్లాడితే, నిజాన్ని బయటపెట్టె అవకాశం ఉంది. మీలో నిజాయితీ ఎక్కువ కాబట్టి, మీరు నిజాన్ని ఎక్కువ కాలాన్ని దాచలేరు’ అంటూ సామ్రాట్ నోరు నొక్కేస్తుంది అనసూయ.

Exit mobile version