Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 25 ఎపిసోడ్ లో ఏకాంతంగా మాట్లాడుకున్న సామ్రాట్, తులసి!

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. సామ్రాట్ గారూ మీది ఏమి పెద్ద వయసు కాదనుకుంటా, ఆ అమ్మాయిలు అన్నట్టు మీరు సినిమాలో హీరోలా ఉన్నారు. మీకు అందంతో పాటు మంచి మనసు కూడా ఉంది. మీరు సీరియస్‌గా పెళ్లిపై ఆలోచించండి. గట్టిగా సంకల్పించుకోండి. మీరు కోరుకున్నది, అనుకున్నది జరుగుతుంది’ అని అంటుంది. అవును తులసీ, నా సంకల్పం గట్టిది కాబట్టి, మన బంధం ఇంకా నిలబడి ఉంది. మీరు ఇంక క్లారిటీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి’ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఆ తరువాత మేడమ్‌గారు కొబ్బరి ముక్క తింటుంటే తులసి వైపు ఓరగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ మీరు నన్ను అలా చూస్తున్నారు అని తులసి తెగ సిగ్గుపడిపోతుంది.

నా జీవితంలో ప్రేమ అనే బంధానికి చోటు లేదు. అందుకు కారణం కూడా నా హేతుబద్ధమైన ఆలోచనో లేక ముగ్గురు బిడ్డల తల్లిననో కాదు. నాలో ఇప్పుడు ప్రేమించే ధైర్యం లేదు. ఒకసారి జరిగిపోయింది. అది అలా అయిపోయింది. ఇంకోసారి నాకు ఓపిక అస్సలు లేదు. వయసులో ఉన్నప్పుడు మనలని ఎవరైనా ప్రేమించి మోసం చేస్తే మనసు మాత్రమే ముక్కలు అవుతుంది. కానీ పాతికేళ్ల ఆ ప్రేమ మోసం చేస్తే తట్టుకోలేం. ఇంకోసారి మరో అవకాశం కూడా ఇవ్వలేను. అందుకే మళ్లీ మళ్లీ పెళ్లి నా వల్ల కాదు. నేను ఆ బంధంలో బాగా అలసిపోయాను. అలాగే ఇంకో మనిషిని కూడా నమ్మలేను. ఎదురు దెబ్బలు తిన్నా, మళ్లీ అదే తప్పు చేయలేను’ అని అంటుంది.

Exit mobile version