Site icon Prime9

Gruhalakshmi : సెప్టెంబర్ 27 ఏపిసోడులో.. మీకు దమ్ముంటే మీ వాడు చేసిన తప్పేంటో చెప్పమని అడిగిన అభి !

gruha lakshmi 27 prime9news

gruha lakshmi 27 prime9news

నేటి గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్

హద్దులు దాటి మాట్లాడుతున్నావ్ అభి..ముందు ఆయనకి సారీ చెప్పని పరందామయ్య అనడంతో..‘నేను సామ్రాట్ గారికి క్షమాపణ చెప్పాలంటే..ముందు ఆయన నోరు విప్పాని గట్టిగా అరుస్తూ ప్రెస్ వాళ్ల ముందు సామ్రాట్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పమనండి..ఈ మనిషి ఎలాంటి వాడో అందరికీ తెలియాలి కదా.. అసలేం తెలుసుకోకుండా పెట్టుబడి పెడుతున్నాడని ఇతన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారా? ముందు వెనుక ఏమి ఆలోచించరా? అని చెడా మెడ సామ్రాట్ ని అభి కడిగిపారేస్తాడు. ఆ మాటలన్ని విన్న సామ్రాట్ వాళ్ల బాబాయ్..‘అసలు మావాడి గురించి నీకేం తెలుసు రా..నీకు మా వాడి పేరు పిలిచే అర్హత కూడా లేదు… నువ్వు మా వాడిని అనేంత వాడివి అయ్యావా అంటూ,నిజాలు మాట్లాడుకోవాలంటే మా వాడి ముందు నిలబడే అర్హత కూడా నీకు లేవని గట్టిగా అరుస్తూ చెబుతాడు. సామ్రాట్ వాళ్ల బాబాయ్‌ని ఆపుతూ.. బాబాయ్ నువ్వు కాసేపు ఊరుకో అని మాట్లాడనివ్వకుండా ఆపేస్తాడు.ఇక అభి మళ్ళీ రెచ్చిపోయి కోట్లు ఆస్తి ఉండటం పెద్ద గొప్ప కాదు నిజాయితీగా కూడా ఉండాలని అభి అంటాడు.

నా కాలర్ పట్టుకుని బెదిరించడం కాదు

అరిస్తే మీరు చేసిన తప్పులన్ని ఒప్పులు అవ్వవు కదా…నా కాలర్ పట్టుకుని బెదిరించడం కాదు..మీకు దమ్ముంటే మీ వాడు చేసిన తప్పు ఏంటో చెప్పమని గట్టిగా నిలదీస్తాడు.ఇక దీంతో సామ్రాట్ వాళ్ల బాబాయ్ నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు.ఇక లాభం లేదు వీడికి నిజలన్ని తెలియాలిసిందే.ఇంకనైనా మీ నాటకాలకు శుభం కార్డు వేసి నిజం చెప్పండి.. మీ వాడు హత్య చేశాడు కదా..మీ వాడు ఒక హంతకుడు కదా అని అభి అనడంతో..‘అవును రా మా వాడు హంతకుడే..కానీ మా వాడు ఏ తప్పు చెయ్యలేదు.చేయని తప్పుకి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.తన కూతురు కానీ కూతురు కోసం తన సంతోషాన్ని మొత్తం చంపుకొని బ్రతుకుతున్నాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ చదవండి :Guppedantha Manasu : సెప్టెంబర్ 27 ఏపిసోడులో వసుని తిట్టిన జగతి మేడమ్ !

Exit mobile version