Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 19 ఎపిసోడ్ లో సామ్రాట్ బాస్ పరువు కాస్తా తుస్సు అయింది !

gruha lakshmi 19 oct prime9news

gruha lakshmi 19 oct prime9news

Gruhalakshmi: నేటి గృహ లక్ష్మీ  ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్

నేను మిమ్మల్ని క్షమిస్తే నేను తప్పు చేసినట్టు అవుతుంది..కాబట్టి నిన్ను క్షమించను..మాపైనే నింద వేశావ్.. ఉద్యోగం ఇచ్చి కొత్త జీవితం ఇచ్చిన ఆ మనిషిని కూడా గౌరవం కూడా ఇవ్వలేదు.అలాంటి మిమ్మల్ని నేను ఎందుకు క్షమిస్తాను’ అని తులసి అంటుంది.ఇక తులసి మేడమ్ గారి నిర్ణయం విన్న తరువాత మన హీరో గారు ఒక రేంజులో రెచ్చిపోతాడు. లాస్యా…అని గట్టిగా అరుస్తూ…. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో.. మా టైం వేస్ట్ చేయకు అని రంకెలు వేస్తూ ఉంటాడు.దీనితో అప్పటి వరకు ప్రాధేయపడిన లాస్య గేర్ మార్చుతుంది.

Read Also: అక్టోబర్ 18 ఎపిసోడ్ లో నాకు ఇష్టం లేని పనులు నేను చేయనంటున్న తులసి?

సామ్రాట్ తో గొడవ పెట్టుకున్న లాస్య

వెల్ మిస్టర్ సామ్రాట్.. వెల్ అని చప్పట్లు కొడుతూ..‘మీరు చాలా తెలివైన వాళ్ళు తులసి చెప్పిందని నాకు జాబ్ ఇచ్చి తులసికి హీరో అయ్యావు.ఇప్పుడు ఆమె కోసమే జాబ్ తీసేసి సూపర్ మేన్‌వి అయ్యావ్..అమ్మా తులసి నువ్వేం తక్కువ కాదు తులసీ..ఇక నీ మాటకు వస్తే సామ్రాట్ కంటే తెలివైన దానివి.కేవలం నీ అవసరం కోసం సామ్రాట్‌ని బుట్టలో వేసుకున్నావ్.. కమ్మగా వండిపెడుతున్నావ్.. అలాగే బోర్ కొడితే అందంగా కబుర్లు చెప్తావ్..లేనిపోనీ ప్రేమని ఒలక బోస్తావ్.. అన్ని రకాలుగా సామ్రాట్ ను కట్టేశావ్..మగాడి బలహీనతల్ని కనిపిపెట్టడంలో నువ్వు మహారాణివి…. ఈ విషయంలో అసలు నిన్ను కొట్టేవాళ్లు ఎవరు లేరని అని లాస్య అంటుంది.తరువాత ఏమి  జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version