Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 15 ఎపిసోడ్ లో తులసి ఒక్క క్లాస్ పీకగానే దారిలోకి వచ్చిన ప్రేమ్

gruha lakshmi 15 oct prime9news

gruha lakshmi 15 oct prime9news

Gruhalakshmi: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

తులసి ఎమోషనల్ డైలాగ్స్ తో క్లాస్ పీకగానే.. ప్రేమ్‌లో మార్పు వచ్చేస్తుంది.ఆ దెబ్బకు తులసి కాళ్లపై పడిపోతాడు..నేను తప్పు చేశానమ్మా? అని అంటాడు. ఇన్నాళ్లూ శ్రుతి.. ఒరేయ్ వెధవా నువ్వు చేసింది పెద్ద తప్పురా? అని ఎంత ప్రాధేయపడినా.. కనిపించని తప్పు ఒక్కసారి అమ్మ చెప్పేసరికి ప్రేమ్ ఒప్పేసుకుంటాడు.. ‘నన్ను క్షమించు అమ్మా’ నేను తప్పు చేశానంటూ అని తులసి కాళ్లపై పడతాడు.క్షమించాల్సింది నేను కాదురా కొడకా.. వెళ్లి మీ భార్య కాళ్లు పట్టుకో’ అని అంటుంది తులసి.దీంతో మన ఆవేశం రావ్.. అమ్మ కొడుకు శ్రుతి కాళ్లు పట్టుకోబోతాడు. దీంతో శ్రుతి.. ప్రేమ్ అడ్డుకుని.. ప్రేమ్ ను గుండెలకు హత్తుకుంటుంది.

ఇక్కడ మనకు తెలియాలిసిన లాజిక్ ఏంటంటే..జరిగిందేదో జరిగింది..ఇంక నుంచి కలిసి ఉందాం అని శ్రుతి అంటే.. నీకు నాపై ప్రేమ లేనే లేదు.. కేవలం నువ్వు మీ అమ్మకి భయపడి నాపై ప్రేమ చూపిస్తున్నావు తప్పితే నా మీద నీకు ఏ ఫీలింగ్స్‌ని లేవని, శ్రుతిని అర్ధం చేసుకోవడం లేదు అని ప్రేమ్‌ని ఈ విధంగా దూరం పెట్టింది. మరి ఇప్పుడు తులసి చెప్పిందనే కదా ప్రేమ్ మారాడు..శృతి ఎంత బ్రతిమిలాడుకున్న అప్పుడు కనిపించని ప్రేమ, ఫీలింగ్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయి.అంతేలే తులసి ఏది చెప్తే అది జరిగిపోతాది అంతే. ఒక్క ప్రేమే కాదు ఏదైనా బయటకు రావాల్సిందే కదా.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version