Site icon Prime9

Gruha Lakshmi: సెప్టెంబర్ 19 ఏపిసోడ్ లో ఈ సీనులో సామ్రాట్ అందరినీ ఏడిపించేశాడు!

gruha lakshmi 19 prime9news

gruha lakshmi 19 prime9news

Gruha Lakshm: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడ్ లో ఈ సీన్లు కన్నీళ్ళు తెప్పించాయి. నందు చేసిన పనికి సామ్రాట్, హానికి యాక్సిడెంట్ జరుగుతుంది. సామ్రాట్ కారులో బయలుదేరి ఉంటాడు. ఈ పాటికి యాక్సిడెంట్ జరిగే ఉంటుందని నందు కంగారుపడుతూ ఉంటాడు. దేవుడా తెలియక తప్పు చేశాను. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని, కారు బ్రేక్‌లు తీసిన విషయంలో నన్ను క్షమించు దేవుడా అంటూ దండం పెట్టుకుంటాడు. సామ్రాట్ కారు డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారిగా వేగాన్ని పెంచుతాడు. అప్పుడు బ్రేక్‌లు ఫెయిల్ అవుతాయి. సామ్రాట్ టెన్షన్ పడుతూ కారుని అదుపు చేయాలని చూస్తాడు కానీ ఎంత ప్రయత్నించిన అదుపులోకి రాదు. దీంతో ఓ చెట్టుకు వెళ్ళి గుద్దేస్తాడు. ఆ ప్రమాదంలో హనీతో పాటు, సామ్రాట్‌ తల పై కూడా పెద్ద గాయం అవుతుంది.

ఈ సీనులో సామ్రాట్ అందరినీ ఏడిపించేశాడు..

ఇంతలో డాక్టర్ రావడంతో, నా హనీకి ఎలా ఉంది? ఇప్పుడు తను ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ‘మీ పాపకు ప్రాణపాయం లేదు. చేతికి మాత్రం చిన్న దెబ్బ తగిలింది. అంతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుందని చెప్తారు. యాక్సిడెంట్ షాక్‌ నుంచి కోలుకునే వరకూ పాపను జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళి మీ పాపని చూసుకోవచ్చని సామ్రాట్ కు చెబుతాడు. దీంతో సామ్రాట్ పరుగెత్తుకుంటూ హనీ దగ్గరకు వెళతాడు. కన్న కూతుర్ని ఆ పరిస్థితిలో చూసిన సామ్రాట్, మీ నాన్న నిన్ను చూసుకోలేని ఓ అసమర్ధుడు, నిన్ను కాపాడలేకపోయాడు. ఈ పిచ్చి నాన్నని క్షమించమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ధైర్యం చెబుతుంది.తర్వాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.

Exit mobile version