Site icon Prime9

Devatha: సెప్టెంబర్ 26 ఏపిసోడులో దేవుడమ్మను రాధ చూడనుందా?

devatha 26 prime9news

devatha 26 prime9news

Devatha Today: నేటి దేవత సీరియల్ ఏపిసోడులో ఈ సీను కంటతడి పెట్టించింది. పిల్లలు జానకీ కోసం ఏడుస్తున్నారని భాగ్యమ్మ, చిన్మయిని, దేవిని తీసుకుని హాస్పిటల్ కు వస్తుంది. రావడం రావడమే, పిల్లలు ఏడుస్తూ జానకీని తెగ కలవరిస్తారు. ఇంకో వైపు డాక్టర్ వచ్చి, ‘అమ్మా ఈ టాబ్లెట్స్ తొందరగా తీసుకొచ్చి ఇవ్వండని రాధకు స్లిప్ ఇస్తాడు. రాధ ఆ కంగారులో ఫోన్ అక్కడే వదిలేసి వెళ్తుంది. ఇంతలో రాధ ఫోన్ రింగ్ అవ్వడంతో దేవి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హలో’ అనగానే అవతల మాట్లాడుతున్న దేవుడమ్మ ‘అమ్మా దేవీ’ఎలా ఉన్నావ్ అమ్మ అనగానే దేవి ఏడుపు ఆపుకోలేక, జరిగినదంతా ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది. జానకీ ప్రమాదం గురించి మొత్తం దేవుడమ్మకు చెబుతుంది.

ఇక వెంటనే దేవుడమ్మా జానకీ చూడాటానికి ఉన్నఫలంగా బయలుదేరి వస్తుంది. ఇక దేవుడమ్మ, రామ్మూర్తితో మాట్లాడి తనకి ధైర్యం చెబుతుంది. బాధ పడకండి రామ్మూర్తి గారు. పిల్లలు బాధ పడినట్టు మీరు బాధపడితే ఎలా అండి అని ఓదారుస్తుంది. కొంత సేపటికి రాధ జానకీ పరిస్థితి గురించి చాటుగా డాక్టర్ చెప్పే మాటలు ఉంటుంది. అప్పుడే జానకీని చూడటానికి అందరూ జానకీ దగ్గరకు వెళ్తారు. అప్పుడే డాక్టర్ జానకీకి పక్షవాతం వచ్చిందని అసలు నిజం బయటకు చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు బోరున ఏడుస్తారు. ఆదిత్య, దేవుడమ్మ పిల్లల్ని ఊరుకోబెడుతుండగా, ఇంతలో కంగారు పడుకుంటూ మాధవ్ వస్తాడు. జానకీ ఏమి మాట్లాడలేదని తెలుసుకుని మాధవ్ ఊపిరి పీల్చుకుంటాడు.

ఇదీ చదవండి: సెప్టెంబర్ 26 ఏపిసోడులో దీపతో బయటకు వెళ్ళిన కార్తీక్

Exit mobile version