Site icon Prime9

Devatha: సెప్టెంబర్ 30 ఎపిసోడ్ లో నేను ఎందుకు బాధపడుతున్నానో మీకు తెలీదండి అంటున్న సత్య!

devatha 30 prime9news

devatha 30 prime9news

Devatha Today: నేటి దేవత సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్. రాధ జానకికీ జ్యూస్ త్రాగిస్తుంటుంది. అది గమినించిన రామ్మూర్తి రాధకు చేతులు లెత్తి దన్నం పెడుతాడు. అమ్మా ‘నీ రుణం ఎలా తీర్చుకోగలను’ అంటూ రాధ ముందే కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు రాధ ‘మీరు చేసిన దానికంటే ఇదేమి పెద్దది కాదు  అండి. నా తల్లికి ఇలాగే ఐతే వదిలేసి వెళ్తానా అంటుంది రాధ. మొత్తానికీ, రామ్మూర్తి ఈ విధంగా ‘అమ్మా రాధా, ఈ క్షణం నీకు మాటిస్తున్నా. నువ్వు నన్ను ఏదైనా అడుగు, నీకు ఏదైనా చేయడానికి నేను సిద్దంగా ఉన్నానని అంటాడు. ‘అడిగే సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. ఆ రోజు మీరు కాదు అనకుండా ఉంటే చాలు’ అంటుంది రాధ.

దేవి, ఆదిత్యలు పెద్ద డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. సత్య అదే విషయం గురించి రగిలిపోతుంది. దేవుడమ్మ వస్తే, రాధక్క ఎందుకు కనిపించకుండా ఉంటుంది. పెద్ద డాక్టర్ కావాలంటే, ఆ ఇంటి వారైనా మాధవ బావగారు, రామ్మూర్తి గారు ఉన్నారుగా, మా ఆయన ఆదిత్యనే ఎందుకు పిలవాలి’ అనుకుంటూ ఉండగా, అప్పుడు దేవుడమ్మ అయ్యో సత్యా, నువ్వు బాగా ఆలోచిస్తున్నావ్. ఆదిత్య అంటే ఆఫీసర్ కదా. పెద్దపెద్దవాళ్లంతా తెలుస్తారనే ఆ అమ్మాయి అలా చేసి ఉంటుందిలే అని అంటుంది. సత్య మనసులో ఈ విధంగా “నా బాధ మీకు ఎప్పటికీ అర్దం కాదు అలాగే నేను ఎందుకు బాధపడుతున్నానో మీకు తెలీదండి అనుకుంటుంది.

ఇదీ చదవండి : సెప్టెంబర్ 30 ఏపిసోడులో మోనిత జీవితంలోకి అడుగుపెట్టనున్న దుర్గా?

Exit mobile version