Site icon Prime9

Devatha: నవంబర్ 02 ఎపిసోడ్ లో దేవి వేసిన స్కెచ్చు మామూలుగా లేదుగా!

devatha nov 02 prime9news

devatha nov 02 prime9news

Devatha Today: నేటి  దేవత  సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. దేవికి  అర్థమైన విషయాన్ని వెంటనే ఆదిత్యకు ఫోన్  చేసి చెబుతుంది. ‘సార్ మా నాయన గురించి నాకో క్లారిటీ  వచ్చింది. అలాగే మరో నిజం కూడా తెలిసింది. మా నాయన చెడ్డొడు కాదు. మంచోడే, మాయమ్మే  చెప్పింది. నాకు కావాలనే నేను నాయన చెడ్డోడు అని అమ్మకి  కోపం వచ్చేలా చేశాను. అందుకే మా అమ్మా నిజం చెప్పింది. మా నాయన చెడ్డోడు కాదట అని చెబుతుంది.

అలా చేయడం తప్పుకదమ్మా’అని ఆదిత్య అంటాడు. ‘మరి ఏం చెయ్యాలి చెప్పు సారు, మా అమ్మని మంచిగా అడిగితే మా నాయన గురించి చెప్పడం లేదు ఇంక అందుకే అలా చేశాను’ అని నవ్వుతూ అలా చెప్తుంది. తరువాతి రోజే ఉదయాన్నే దేవికి ఓ సోదమ్మా ఎదురుపడుతుంది. ఆమెని చూడగానే దేవికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఆ ‘సోదమ్మా నీకు కావాల్సిన డబ్బులు నేను చేస్తాను. ప్లీజ్ నాకో సహాయం చెయ్ అని ఆడగుతుంది. మాయమ్మ నాకు మా నాయన్ని చూపించమంటే అస్సలు చూపించడం లేదు. నువ్వే నాకు సాయం చేసి, మా అమ్మని మా నాయన్ని కలిసేలా చెయ్ ప్లీజ్’ అంటూ సోదమ్మను రిక్వస్ట్ చేసుకుంటుంది.

Exit mobile version