Site icon Prime9

Devatha: సెప్టెంబర్ 28 ఏపిసోడులో సత్య ఉద్దేశం తెలుసుకోనున్న ఆదిత్య!

devatha 28 prime9news

devatha 28 prime9news

Devatha Today: నేటి దేవత సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. రాధ, దేవికి, చిన్మయికి అన్నం తినిపిస్తూ ఉండగా అప్పుడే చిన్మయి, దేవి దగ్గర ఒట్టు వేపించుకొని ‘నువ్వు ఆఫీసర్ సార్‌ వాళ్లతో అంతక ముందులా ఉండకపోతే నా మీద ఒట్టే. నేను ఇప్పటి నుంచి అన్నం కూడా తినను’ అని దేవిని భయపెడుతుంది. దానితో సరే అక్కా ఇక నుంచి నువ్వు ఎలా చెబితే అలా వింటానాని అంటుంది దేవి. ఆ మాటలన్ని విన్న రాధ చాలా సంతోషిస్తుంది. వాళ్ల మాటలను చాటుగా విన్న మాధవ, తలపట్టుకొని, నా కూతురు ‘చిన్మయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో ముందు తెలుసుకోవాలనుకుంటాడు.

సత్య మనసులో ఏముందని తెలుసుకోనున్న ఆదిత్య..

మరోవైపు సత్య, దేవుడమ్మతో ఇలా మాట్లాడుతూ ‘ఆంటీ జానకీ అమ్మగారిని చూసి వస్తానని చెప్తూ ‘అవునా మంచిది. అమ్మ అలాగే దేవితో కూడా మాట్లాడు. తను అంతకు ముందులా నన్ను ప్రేమగా పలకరించడం లేదు. నీ కోపంలో అలా అన్నానని నువ్వు ఐనా సర్దిచెప్పని దేవుడమ్మ అంటుంది.‘సరే ఆంటీ, మీరు బాధ పడకండి ఆంటీ అని చెప్పి, రాధ అక్కతో కూడా మాట్లాడే పని ఉంది. నేను వెళ్లొస్తానని చెప్పి వెళ్తుంది. ఇక ఆ మాటలన్ని విన్న ఆదిత్య తల పట్టుకొని ‘అసలు సత్య మనసులో ఏముందని ఆలోచిస్తాడు.

ఇదీ చదవండి:  రిషి చేతికి దెబ్బ తగలడంతో బోరున ఏడుస్తున్న వసుధార!

Exit mobile version