Site icon Prime9

Bigg Boss season 6: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్ళే!

Bigboss 6 telugu 1st week nominations list

Bigboss 6 telugu 1st week nominations list

Big Boss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 లో మనం ఏది ఐతే ఊహించమో అదే జరుగుతుంది. మొదటి వారంలో బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చగా  తిట్లు మొదలయ్యాయి. అది కాకుండా  ఈ  నామినేషన్స్  చూడటానికి చాలా ఇంటరెస్ట్ గా ఉంది. నిన్న రాత్రి వచ్చిన ఎపిసోడులో  ఇంట్లో వాళ్ళు అందరూ ఒక రేంజులో  తిట్టుకుంటున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన మెరీనా-రోహిత్‌ జంట  హంగామా మాములుగా లేదు. నువ్వు నాకు సమయాన్ని ఇవ్వడం లేదు ఇంకా చెప్పాలంటే హగ్ ఇవ్వడం లేదు ముద్దు ఇవ్వడం లేదంటూ మెరీనా భాదపడటం, వాటికి  రోహిత్‌  వివరించడం  జరుగుతుంది. సింగర్ రేవంత్ గొంతు కూడా గట్టిగానే వినిపిస్తుంది. రేవంత్ ఇంట్లోవాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ  వారంలో నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటేఇనయ, బాల ఆదిత్య, అభినయ, ఫైమా, ఆరోహి, చంటి, శ్రీ సత్య మరియు రేవంత్ మొదటి వారంలో నామినేట్ అయిన పోటీదారులు. కానీ ఇక్కడ మనం అనుకోని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన మెరీనా-రోహిత్‌ ను ఇంట్లో వాళ్ళు, వాళ్ళలో ఏ ఒక్కరిని నామినేట్ చేసిన ఇద్దరూ నామినేట్ అవుతారని బిగ్ బాస్  కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. మన భాషలో చెప్పుకోవాలంటే  ఇద్దరిలో ఒక్కరు ఎలిమినేట్ ఐనా  ఇద్దరు బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. వీరిలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఎవరిని ఇంట్లో ఉంచుతారో, ఎవరిని ఇంటి నుంచి బయటికి పంపిస్తారో ఆదివారం వరకు వేచి చూడాలి.

Exit mobile version