Site icon Prime9

Bigg Boss 6 : బిగ్ బాస్ లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ తప్పదా

interesting-details-about-bigg-boss-6-telugu-this-week-elimination

interesting-details-about-bigg-boss-6-telugu-this-week-elimination

Bigg Boss 6 :  బిగ్ బాస్ షో గత సీజన్లు ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి. కాగా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం చేసినప్పటికీ ఆ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 6 ను మళ్ళీ బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభం అయిన మొదటి వారం నుంచే అట్టప్లాప్ షో అంటూ ముద్ర వేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు ఎంచుకున్న కంటెస్టెంట్స్ అని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.

గతంలో టాప్ లో ఉండే టీఆర్పీ ఇప్పుడు సీరియల్స్ స్థాయిలో కూడా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ రావడం లేదని అంటున్నారు. మొత్తం 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతానికి ఏడుగురు మిగిలారు. ఇందులో ఈవారం నామినేషన్లలో రేవంత్, కీర్తి , శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ , రోహిత్ ఉన్నారు. ఇక టికెట్ టు ఫినాలే రావడంతో శ్రీహాన్ ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ముందు నుంచి ఈ వారం అతి తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్‏లో ఉన్నది కీర్తి. ఆ తర్వాతి స్థానంలో శ్రీసత్య ఉందని సమాచారం.

ఓటింగ్ పరంగా టాప్ 1లో రేవంత్ ఉండగా ఆ తర్వాత స్థానంలో శ్రీహాన్, ఇనయ, రోహిత్, ఆదిరెడ్డి ఉన్నారు. టాప్ 5 గా మారు ఉంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం కూడా కీర్తి అందరి కంటే చివరి స్థానంలో ఉండగా ఈ వారం ఇంటి నుంచి ఆమె ఎలిమినెట్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే కీర్తితో పాటు శ్రీసత్య వెళ్లడం ఖాయంగా అనిపిస్తుంది. కానీ అలా జరగుకుండా బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

గతంలో కూడా ఓటింగ్ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేసి బిగ్ బాస్ లో పలువురుని ఎలిమినేషన్ చేసిన ఘటనలు జరిగాయి. ఈ కోవలోనే ఈసారి ఇనయను ఎలిమినేట్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఫిజికల్ టాస్కులలో కూడా అబ్బాయిలకు గట్టి పోటీని ఇస్తూ పోరాటం చేసింది. అంతే కాకుండా చివరి వారం కెప్టెన్ గా కూడా అయ్యింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం ఇనయ ఇంటి నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. చూడాలి మరి రేపు ఎలిమినేషన్ లో ఇంటి నుంచి ఎవరు వెళ్తారా అని…

Exit mobile version