Prime9

Bigg Boss: రోహిత్ సేఫ్ రాజ్ ఎలిమినేట్.. అతి తక్కువ ఓట్లతో ఫైమా

Bigg Boss: బుల్లితెరపై బిగ్ బాస్ హౌస్ రియాలిటీ ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షో కి ప్రేక్షకులు కూడా అంతే ఆదరాభిమానాలు చూపుతున్నారు. ఇకపోతే ఆదివారం రాగానే అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని అందరిలో కుతూహలం ఉంటుంది. కాగా ఈ సారి ఎలిమినేషన్స్ కి సంబంధించిన రౌండ్ మొదలటయ్యే సరికి ఆదిరెడ్ది, ఫైమా, రోహిత్, రాజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఆదిరెడ్డి – ఫైమా సేఫ్ అవుతారనీ, రోహిత్ – రాజ్ లలో ఎవరో ఒకరు వెళ్లిపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఊహించని రీతిలో ఆదిరెడ్డితో పాటు రోహిత్ సేఫ్ అయ్యాడు. టాప్ 5లో ఉంటుంది అనుకున్న ఫైమా రాజ్ తో పాటు ఎలిమినేషన్ లో నిలబడింది. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఆ పాస్ ద్వారా ఎలిమినేషన్ ను తనని తాను సేవ్ చేసుకోవచ్చు, తనపై తనకి నమ్మకం ఉంటే ఎదుటివారిని సేవ్ చేయడానికి కూడా దానిని వాడొచ్చు. కాగా తాను ఈ వారం ఇంటికెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోని ఫైమా ఆ పాస్ ను తనకోసమే ఉపయోగించడం వల్ల ఆమె కంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ రాజ్ బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. ఆఖరికి మోడల్ రాజ్ ఎలిమినేట్ అయ్యారు.

ఇదీ చదవండి: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాల వివరాలు ఇవే

Exit mobile version
Skip to toolbar