Site icon Prime9

Bigg Boss 49th Episode: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఇంటి నుంచి అర్జున్ అవుట్..!

bigg boss 49th day episode arjun kalyan eliminated

bigg boss 49th day episode arjun kalyan eliminated

Bigg Boss 49th Episode: వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున వచ్చి ముందుగా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఈ వారం మొత్తంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుఒప్పులను వారికి సరైన భాషలో కొట్టి కొట్టనట్టు చెప్పాడు నాగ్. శనివారం ఎపిసోడ్లో రేవంత్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు కింగ్. ఇకపోతే బిగ్ బాస్ ఇంట్లో  “మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ మరియు అన్ డిజర్వింగ్ పర్సన్ (అర్హులు, అనర్హులు)” ఎవరని ఒక్కొక్కరిని పిలిచి అడిగారు నాగార్జున. దానికి చాలా మంది శ్రీహాన్ అర్హుడని మెరినా అనర్హురాలని ఓటేశారు. అంతేకాక గీతూ, సూర్య, రేవంత్, బాలాధిత్య కూడా డిజర్వింగ్ పర్సన్స్ జాబితాలో ఉన్నారు. కాగా వీరిలో ఒక్కొక్కరిలో ఒక్కో లోపం ఉంది వాటిని సరిచేసుకున్నవారు ప్రేక్షకులను మెప్పించగల బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్లో గీతూ, సూర్య తప్ప మిగతా అందరూ ఉన్నారు. అందుకే ఈసారి ఎవరు బయటకు వెళతారో అంచనా వేయడం కూడా కష్టమైంది. ఈ వారం మెరీనా లేదా వాసంతి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు వీక్షకులంతా. ఎందుకంటే వీరిద్దరు సరిగ్గా ఆడటం లేదని ఇంటి సభ్యులంతా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్ చేయడం లేదంటూ వీరిని చాలా సార్లు హెచ్చరించారు. అయితే ఈ వారమైతే వాసంతి జైలుకి కూడా వెళ్లింది. కాబట్టి దాదాపు అందరూ మెరీనా లేదా వాసంతి వెళ్లిపోతారని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట. వారిద్దరినీ కాకుండా ప్రేమి పిపాసి అయిన అర్జున్ కళ్యాణ్‌ను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. అర్జున్ ఎలిమినేషన్ అయితే శ్రీసత్య ఎలా ఫీలవుతుందో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో డిజాస్టర్ గా నిలిచిన “వాసంతి”.. నాగార్జున చేతిలో రేవంత్ కి క్లాస్

Exit mobile version