Site icon Prime9

Big Boss Season 6: ఇనయని మరోసారి టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు

Innaya Sulthana bigboss 6

Big Boss Season 6: ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి.ఇంటి సభ్యులందరు కలిసి మొత్తంగా ఇనయని మరోసారి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది..ఎందుకంటే ఈ నామినేషన్స్‌లో శ్రీహాన్, సుదీప, గీతు, ఆరోహి, శ్రీ సత్య, చంటి, ఆర్జే సూర్య, రోహిత్ మెరీనా, కీర్తి ఇలా అందరూ నామినేట్ చేశారు.. ఇలా చేయడం ఒక రకంగా మంచిదే అని చెప్పుకోవచ్చు..ఈమె మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ గా మారుతుంది.బిగ్ బాస్ అదరించే ప్రేక్షకుల నుంచి కూడా సింపథీ కూడా పెరుగుతుంది. బిగ్ బాస్ లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఏ కంటెస్టెంట్‌ని ఐతే హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తారో ఆ కంటెస్టెంట్‌కి ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటుంది.ఇక ఈ సీజన్‌లో ఇనయకి బాగా కలిసి వస్తుంది.బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో దాదాపు సగానికి సగం మంది ఇనయని నామినేట్ చేశారు.ఈ వారం ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం.

1. ఆది రెడ్డి – ఆరోహి, సుదీప ను నామినేట్ చేశాడు.
2. ఫైమా – ఆరోహి, సుదీప ను నామినేట్ చేసింది.
3. కీర్తి – ఇనయ, రేవంత్ ను నామినేట్ చేసింది.
4. రోహిత్,మెరినా – ఇనయ,ఆర్జే సూర్య ను నామినేట్ చేశారు.
5. రాజ్ – శ్రీహన్ ,ఆరోహి ను నామినేట్ చేశాడు.
6. సింగర్ రేవంత్ – శ్రీ సత్య ,ఆరోహి ను నామినేట్ చేశాడు.
7. ఆర్జే సూర్య – ఇనయ,వాసంతి ను నామినేట్ చేశాడు.
8. అర్జున్ కళ్యాణ్ – రాజ్,గీతు ను నామినేట్ చేశాడు.
9. చంటి – ఇనయ, గీతు ను నామినేట్ చేశాడు.
10. ఇనయ – సుదీప, శ్రీహాన్ ను నామినేట్ చేసింది.
11. బాలాదిత్య – సూర్య, రేవంత్ ను నామినేట్ చేశాడు.
12. శ్రీ సత్య – ఇనయ, రేవంత్ ను నామినేట్ చేసింది.
13. ఆరోహి – ఇనయ, రేవంత్ను నామినేట్ చేసింది.
14. వాసంతి – రేవంత్, ఆర్జే సూర్య ను నామినేట్ చేసింది.
15. గీతూ – ఇనయ, చంటి ను నామినేట్ చేసింది.
16. సుదీప – ఇనయ, రేవంత్ ను నామినేట్ చేసింది.
17. శ్రీహన్ – ఇనయ, రాజ్ ను నామినేట్ చేశాడు.

 

మరిన్ని బిగ్ బాస్ వార్తలు చదవండి : BiggBoss Season6: బిగ్‌బాస్ హౌస్లో రేవంత్ రచ్చ… నేను మహా కన్నింగ్ అంటూ ఆట

Exit mobile version