Site icon Prime9

Karthi: సెట్ లో ప్రమాదం.. హాస్పిటల్ లో హీరో కార్తీ.. అసలేం జరిగిందంటే.. ?

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇంకా చెప్పాలంటే తమిళ్ లో కంటే కార్తీకి తెలుగులోనే ఫ్యాన్ బేస్ ఎక్కువ. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఊపిరి, సర్దార్.. ఖైదీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. గతేడాది కార్తీ.. సూర్య నటించిన కంగువలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. కంగువ 2 లో సూర్య – కార్తీల మధ్య భీకర పోరాటం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయేసరికి సీక్వెల్ ఉంటుందా.. ? ఉండదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కార్తీ చేతిలో ఉన్న సినిమాల్లో సర్దార్ 2 ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సర్దార్ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 వస్తుంది. సర్దార్ ను మించి సీక్వెల్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని సమాచారం.

Chiranjeevi: ఎంత పెద్ద స్టార్స్ అయినా మెగాస్టార్ కు అభిమానులే.. ఈ ఫోటోనే నిదర్శనం

ఇక సర్దార్ 2 సెట్ లో కార్తీకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తుండగా.. కార్తీ కాలికి గాయం అయ్యినట్లు సమాచారం. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. గాయం పెద్దది కావడంతో నడవలేని స్థితిలో ఉన్నాడని, కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట. దీంతో మేకర్స్ షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తోంది.

కార్తీ కాలికి గాయం అయ్యిందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక కార్తీ సర్దార్ 2 కాకుండా ఖైదీ సీక్వెల్ లో కూడా కార్తీ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ రెండు సినిమాలతో కార్తీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar