Site icon Prime9

Suriya-Rolex:’రోలెక్స్‌’ మూవీపై సూర్య ఆసక్తికర కామెంట్స్‌ – ఏమన్నాడంటే!

Suriya Comments

Suriya About Rolex Movie: హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. నవంబర్‌ 14న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. పిరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్‌ శివ దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది. దీంతో మూవీ టీం ‘కంగువా’ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో సూర్య కూడా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య తన నెక్ట్స్‌ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. అదే ‘రోలేక్స్‌’ మూవీ. ‘విక్రమ్‌’ ఫేం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు.

కాగా ‘లోకనాయకుడు’ కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్‌ మూవీలో క్లైమాక్స్‌లో సూర్య రోలెక్స్‌ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని క్షణాలే అయినా తనదైన విలనీజంతో విధ్వంసం సష్టించాడు. దీంతో విక్రమ్‌లో రోలెక్స్‌ పాత్రకు ఫుల్‌ క్రేజ్‌ వచ్చింది. అయితే ఈ పాత్రతో సూర్యతో తాను ఫుల్‌లెన్త్‌ మూవీ చేయబోతున్నాని డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సినిమా గురించి సూర్య కూడా ప్రస్తావించాడు. కంగువా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ ‘రోలెక్స్‌’ చిత్రంపై సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రోలెక్స్‌ మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది.

సూర్య ఏమన్నాడంటే..

తాజాగా కంగువా చిత్ర ప్రమోషన్స్‌లో సూర్య మాట్లాడుతూ… తన నెక్ట్స్‌ మూవీ లోకేష్‌ కనగరాజ్‌ అనే హింట్‌ ఇచ్చేశాడు. లోకేష్‌తో తన చేయబోయే రోలెక్స్‌ చిత్రం గురించి చెబుతూ ఇలా అన్నాడు. ఈ సినిమా తను ఇదివరకే నటించిన మరో చిత్రానికి కనెక్షన్‌ ఉంటుందని చెప్పాడు. 1986లో కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాకు 2022లో వచ్చిన విక్రమ్‌ చిత్రానికి ఎలాంటి లింక్‌ ఉందో అలాగే రోలెక్స్‌ కూడా సూర్య గత చిత్రం లింక్‌ ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే ఇది విక్రమ్‌ మూవీ అయితే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో సూర్య అతిథి పాత్రలో మాత్రమే కనిపించాడు. విక్రమ్‌ 2లోనూ రోలెక్స్‌గా విలన్‌గా కనిపించబోతున్నాడు. మరి ఈ పాత్రతో పూర్తి స్థాయిలో సినిమా అంటే అది డ్రగ్స్‌ రిలేటెడ్‌ అయ్యి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరి రోలెక్స్‌తో లింక్‌ అయ్యే ఆ సినిమా ఏంటనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అంతా సూర్య నటించిన గత చిత్రం ‘ఒక్కడున్నాడు’ మూవీకి లింక్‌ అయ్యి ఉంటుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Exit mobile version