Telusu Kada Movie Release Date Announced Video: సిద్ధు జొన్నలగడ్డ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె డైరెక్టర్‌గా పరిచయం కానుంది. ఇందులో సిద్దు సరసన హీరోయిన్లుగా రాశీ ఖన్నా, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిలు నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ని తాజాగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మూవీ టీం ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేసింది. ఈ రిలీజ్ డేట్‌ని మేకర్స్ కాస్తా వినూత్నంగా ప్రకటించారు. పోస్టర్‌తో కాకుండ హీరోహీరోయిన్లు వీడియోతో ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఇందులో హీరో సిద్దుకి హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు వీడియో కాల్స్ చేస్తారు. ఒకరికి తెలియకుండ ఒకరితో మాట్లాడుతుంటాడు. రాశీఖన్నాతో మాట్లాడుతుండగా.. శ్రీనిధికి బిజీ వస్తుంది. దీంతో ఆమె హీరోయిన్ రాశీ ఖన్నాకు ఫోన్ చేస్తుంది. ఆమె శ్రీనిధిని కూడా కాల్‌లోకి తీసుకుని ఎందుకు చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది.
సిద్ధు.. నీ బిజీ అంటే ఇదేనా అని కోపంగా ప్రశ్నిస్తుంది. అయినా సిద్దు నీ ఫోన్ ఎందుకు ఎత్తాలి అని అడుగుతుంది. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇంతలోనే సిద్దు “తెలుసు కదా.. ఐ లవ్ 2” అంటాడు. అదేంటో తెలియాంటే అక్టోబర్ 17న మీకే అర్థమవుతుంటాడు. అంటే తెలుసు కదా మూవీని అక్టోబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా రోటిన్‌కి భిన్నం విడుదల తేదీని ప్రకటించిన ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది మూవీ టీం. కాగా ఈ సినిమా పిపుల్ మీడియా ప్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.