Prime9

Actress Shobana: బచ్చన్‌ సార్‌తో షూటింగ్‌.. చెట్టు వెనక్కి వెళ్లి డ్రెస్ మార్చుకొమన్నారు – నటి శోభన షాకింగ్‌ కామంట్స్‌

Actress Shobana Comments on Amitabh Bachchan: సీనియన్‌ నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌, సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ వంటి స్టార్స్‌ సరసన నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొంది. 90’sలో స్టార్‌ హీరోయిన్‌లో రాణించింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేసి అక్కడ మంచి గుర్తింప పొందింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండ సింగిల్‌గా ఉన్న ఆమె భరత నాట్యం కళాకారినిగా రాణిస్తోంది. అప్పుడప్పుడు స్టేజ్‌ షోలు ఇస్తూ అలరిస్తుంది.

 

అయితే ఎన్నో ఏళ్ల తర్వాత శోభన.. కల్కి 2898 ఏడీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా కాస్తా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి పలకరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గురించి ఓ ఆసకర విషయం బయటపెట్టింది. ఆయనతో కలిసి ఓ సినిమా నటిస్తున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఛేదు అనుభవనాన్ని గుర్తు చేసుకుంది. బచ్చన్‌ సర్‌ అప్పుడెలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. నేను నటించి హీరోల్లో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునేవారు. నిజానికి గొప్ప నటులలో సాధారణ కనిపించే అంశం విధేయత.

 

బచ్చన్‌ సర్‌ గురించి మీకో విషయం చెప్తాను. ఓ సినిమా సమయంలో ఆయనతో కలిసి అహ్మదాబాద్‌లో ఓ సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ పాట కోసం నేను దుస్తులు వెంట వెంటనే దుస్తులు మార్చాల్సి ఉంటుంది. అందుకోసం చాలా దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకున్నాను. అయితే ఓ షాట్‌ తర్వాత నేను డ్రెస్‌ మార్చుకోవాల్సి ఉంది. షూటింగ్‌ ఒపెన్‌ ప్లేస్‌లో కావడంతో చూసేందుకు స్థానికులు చాలామంది వచ్చారు. దీంతో నా క్యారవాన్‌ దగ్గరికి వెళ్లడానికి వీలు లేకుండపోయింది. డ్రెస్‌ మార్చుకోవాలని నా క్యారవాన్‌ ఎక్కడ అని అడిగాను. అందుకు అక్కడ ఉన్న ఒకతను.. మలయాళ ఇండస్ట్రీ నుంచే వచ్చింది కదా.

 

ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోవడం వాళ్లకు అలవాటే.. ఏ చెట్టు చాటుకో వెళ్లి దుస్తులు మార్చుకోమనండి అని కామెంట్‌ చేశారు. ఆ మాటలను వాకిటాకి ద్వారా బచ్చన్‌ సర్‌ విన్నారు. ఆ కామెంట్స్ వినిపించగానే ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయన వచ్చి ఎవరా మాట అన్నది? అని ఫైర్‌ ఆగ్రహించారు. ఆ తర్వాత నన్ను తన క్యారవాన్‌ వద్దకు తీసుకువెళ్లి.. డ్రెస్‌ మార్చుకోమ్మని చెప్పి ఆయన వెళ్లిపోయారు” అని శోభన చెప్పుకొచ్చారు. అనంతరం కల్కి సినిమాలో కూడా ఆయన బరువున్న దుస్తులు వేసుకున్నారు. భారీ ప్రోస్తటిక్స్‌ (హెవీ మేకప్‌) వాడారు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిలుచుని మరి పలకరించేవారని చెప్పారు.

Exit mobile version
Skip to toolbar