Site icon Prime9

Sankranthiki Vastunnam TRP: బుల్లితెరపై కూడా సంచలనం సృష్టిస్తున్న బుల్లిరాజు.. టీఆర్పీ ఎంతంటే..?

Sankranthiki Vastunnam TRP: ఈ మధ్య సినిమాలు ఎలా ఉన్నాయి అంటే.. థియేటర్ లో హిట్ అయితే ఓటీటీలో హిట్ అవ్వడం లేదు. థియేటర్ లో డిజాస్టర్ టాక్ అందుకున్నా కూడా ఓటీటీలో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక టెలివిజన్ ప్రీమియర్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో ఎవరికీ తెలియను కూడా తెలియడం లేదు. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ అందుకొని మరో రికార్డు సృష్టించింది.

 

విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. మొదటిసారి వెంకీ మామను వంద కోట్ల క్లబ్లో చేర్చింది.

 

ఇక కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటిటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాను ఓటిటీలోనూ, టీవిలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేశారు. మార్చి 1 న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులోనూ.. అదే సమయానికి జీ5 లోనూ సంక్రాంతికి వస్తున్నాం సందడి చేసింది.

 

సంక్రాంతికి వస్తున్నాం కథ విషయానికొస్తే.. YD రాజు ఒక ఎక్స్ పోలీసాఫీసర్. తనకు ఎవరు లేకపోవడంతో తన మాస్టర్ పేరునే ఇంటిపేరుగా పెట్టుకొని.. ఎంత నిజాయితీగా పనిచేసినా పనిలో గుర్తింపు రావడంలేదని.. రిజైన్ చేసి భాగ్యం అనే పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అయిపోతాడు. ఒక సీరియస్ మిషన్ కోసం పోలీస్ ఆఫీసర్ మీనాక్షీ.. రాజునూ వెత్తుకుంటూ వస్తుంది. అయితే రాజు, మీనాక్షి గతంలో లవర్స్ అని తెలుసుకున్న భాగ్యం.. తనుకూడా మిషన్ ఛేదించడానికి వస్తానని పట్టుపడుతుంది.

 

ఇక ఆ సీరియస్ మిషన్ కోసం భార్య, మాజీ ప్రేయసితో వెళ్లిన రాజు ఏమయ్యాడు.. ? ఎలా ఇద్దరి ఆడవాళ్ళ మధ్య నలిగిపోయాడు అనేది కథ. సినిమా మొత్తంలో బుల్లిరాజు కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రాజు కొడుకుగా.. తండ్రిని మాట తట్టుకోలేక బూతుపురాణం విప్పే బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా కావడంతో టీవీలో ఈ సినిమా రేటింగ్ ఆకాశాన్ని తాకింది.

 

ఇక తాజాగా సంక్రాంతికి వస్తున్నాం టీఆర్పీ రేటింగ్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టీవీలో ఏకంగా ఈ సినిమాకు 18.1 టీఆర్పీ వచ్చింది. గత రెండేళ్లలో ఇంత టీఆర్పీ వచ్చిన సినిమా ఏది లేదనే చెప్పాలి. SD ఛానెల్ మరియు HD ఛానెల్ కలిపి ఈ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.

 

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ యూనివర్సల్ ప్రీమియర్.. ఇప్పుడు ఇది ఏకగ్రీవం. టీఆర్పీలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రికార్డు బ్రేక్ చేసినందుకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ చెప్పుకొచ్చాడు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ ను సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar