Prime9

Gamblers Trailer: సంగీత్‌ శోభన్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ చూశారా?

Sangeeth Shobhan Gamblers Official Trailer Out: మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో సంగీత్‌ శోభన్‌. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం యూత్‌ఫుల్‌ క్రేజీ హీరోగా ఇండస్ట్రీలో అతడి పేరు బాగా వినిపిస్తోంది. ఎంట్రీతో వరుస హిట్స్‌ అందుకు ఈ యంగ్‌ హీరో ‘గ్యాంబ్లర్స్‌’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 6న విడుదల కాబోతోంది.

 

ఇప్పటికే ప్రమోషన్స్‌ ప్రారంభించిన మూవీ టీం తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది టీం. స్పెస్పన్స్‌ థ్రిల్లర్‌తో ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌లో తన కామెడీ యాంగిల్‌ చూపించిన సంగీత్‌ శోభన్‌.. ఇందులో సీరియస్‌గా కనిపించాడు. గ్యాంగ్‌స్టర్‌గా ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో దిగాడు. ఇప్పటికే యూత్‌లో యమ క్రేజ్‌, ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సంగీత్‌ శోభన్‌కు.. గ్యాంబ్లర్స్‌లో గ్యాంగ్‌స్టర్‌ రోల్‌పు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సస్పెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. దీంతో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

 

ఇందులో సంగీత్‌ శోభన్‌ విభిన్న పాత్రలో అలరించబోతున్నాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుందనిపిస్తోంది. మరి విడుదల తర్వాత ఈ చిత్రం ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుంది, సంగీత్‌ శోభన్‌ క్రేజ్‌ ఏ మేర నిలబెడుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తుండగా.. జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేష్‌, సాయి శ్వేత,జస్విక, పృథ్వీరాజ్‌ బన్న, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Gamblers Trailer | Sangeeth Shobhan,Prashanthi Charuolingah | Sashank Tirupathi | KSK Chaitanya

Exit mobile version
Skip to toolbar