Site icon Prime9

Samantha: ఏ మాయ చేసావే.. ప్రతి సీన్ నాకు ఇప్పటికీ గుర్తే

Samantha:  స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో  బిజీగా మారింది.  ఈ మధ్యకాలంలో ఈ చిన్నది ఎక్కువ బాలీవుడ్ లోనే కనిపిస్తుంది ఈ మధ్యనే సామ్.. ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ 15 ఏళ్ల కెరీర్ లో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఎన్నో వివాదాలను.. ఇంకెన్నో విమర్శలను అందుకుంది. ప్రేమ, పెళ్లి నుంచి బయటకు వచ్చేసింది. ఏ మాయ చేసావే సినిమాతో సామ్  తెలుగులో తన కెరీర్ ను మొదలుపెట్టింది.

15 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా తనకు ఏ మాయ చేసావే సినిమాలోని ప్రతి సీన్ గుర్తుందని సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన కెరీర్, స్ట్రగుల్స్, ఏం నేర్చుకుంది.. ? ఇప్పుడెలా మారింది.. ? అని విషయాలను పంచుకుంది.

” 15 ఏళ్లు అంటే మాములు విషయం కాదు. కొన్ని జ్ఞాపకాలు గుర్తు ఉన్నాయి. మరికొన్ని గుర్తులేవు. నా కెరీర్ మొదటిలో నేను నటించిన సినిమాలు ఇప్పుడు చేస్తే చాలా చెత్తగా నటించానని అనిపిస్తుంది. అయితే.. వాటినుంచి నేను ఎన్నో పాఠాలను నేర్చుకున్నాను. నాకంటూ ఒక గురువు లేరు. ఏది వస్తే అటే వెళ్లాను. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాను.

మొదట్లో నాకు గ్లామర్ రోల్స్ లో నటించడం చాలా కష్టంగా అనిపించింది. బయట ఆ  పాత్రలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకొని అందులోకి పరకాయప్రవేశం చేయడానికి ప్రయత్నించేదాన్ని.  ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నవ్వు వస్తుంది. తమిళ్ లో నా మొదటి సినిమా మాస్కో కావేరి. రాహుల్ రవీంద్రన్ హీరో. అప్పుడు జరిగిన విషయాలేమి నాకు గుర్తు లేవు. ఎందుకంటే.. నేను ఒక్కరోజే ఆ షూట్ లో పాల్గొన్నాను. ఆ తరువాత కొన్నిరోజులు సినిమా ఆగిపోయింది.

 

Srikanth: రోజా.. రొమాన్స్ చేస్తూ కూడా అన్నా అని పిలిచేది

ఇక ఏ మాయ చేసావే నాకు ఇప్పటికీ చాల స్పెషల్ సినిమా. ఇప్పటికీ ఆ సినిమాలో ప్రతి షాట్, సీన్ నాకు గుర్తు ఉన్నాయి. కార్తీక్ గేటు దగ్గర ఉంటే నేను నడుచుకుంటూ వస్తాను. అది నా మొదటి షాట్. డైరెక్టర్  గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతమైన అనుభూతి. ఆయనకు ప్రతి పాత్రను ఎలా డిజైన్ చేయాలో తెలుసు. ఏ మాయ చేసావే లాంటి పాత్ర తరువాత నన్ను సంతృప్తి పరిచిన సినిమాలు చాలా తక్కువ.

నా కెరీర్ లో వెనక్కి వెళ్లి చూసుకుంటే చాలా ఉన్నాయి.  ఆనందం, దుఃఖం, సమస్యలు.. ఇలా ఏది మిగలలేదు. అన్ని చవిచూశాను. ఎన్నో నేర్చుకున్నాను. వచ్చే 15 ఏళ్లు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఏ మాయ చేసావే సమయంలోనే నాగ చైతన్య- సమంత కలుసుకున్నారు. ఆ తరువాత వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు దారితీసింది. నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం సామ్ ఒంటరిగా నివసిస్తుంది. మరి  భవిష్యత్ లో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.

Exit mobile version
Skip to toolbar