Site icon Prime9

Rithu Chowdary: రూ.700 కోట్ల స్కామ్‌లో అడ్డంగా బుక్ అయిన బుల్లితెర నటి రీతూ చౌదరి

Rithu Chowdary

Rithu Chowdary

Rithu Chowdary: బుల్లితెర నటి రీతూ చౌదరికి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది. రూ.700 కోట్ల స్కామ్‌లో ఆమె అడ్డండా బుక్ అయినట్లు చర్చ జరుగుతుంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరును సంపాదించుకుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ రకరకాలు పోస్ట్‌లను షేర్ చేస్తూ ఉంటుంది. చిన్నచిన్న షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేస్తూ తక్కువ సమయంలోనే పాపులారిటీని దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం ఓ ల్యాండ్ స్కామ్‌లో ఆమె అడ్డంగా ఇరుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నంకు చెందిన రూ.700 కోట్ల స్కామ్‌లో రీతు చౌదరి పేరు బయటపడింది. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య.

దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్.. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.

ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు తెలీదు.. నిజా నిజాలు ఏంటో రీతు చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అని ఆసక్తి రేకెత్తిస్తుంది.

Exit mobile version