Prime9

Rakul Preet Singh on weirdest Rumor: హైదరాబాద్‌ ఇల్లు ఓ రాజకీయ నాయకుడి గిఫ్ట్.. మా నాన్న కోపంతో రగిలిపోయాడు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Rakul Preet Singh Opens on Weirdest Rumor in Hyderabad: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిచింది. ముఖ్యంగా తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసింది. ఇక్కడ దాదాపు అందరు స్టార్‌ హీరో సరసన నటించింది. అయితే టాలీవుడ్‌లోకి వచ్చిన అతితక్కువ టైంలోనే ఈమే సినిమాలతో పాటు బిజినెస్‌ ప్రారంభించింది. అతి తక్కువ టైంలోనే హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొన్నది. దీంతో అప్పట్లో ఆమె ఓ రూమర్‌ బాగా వినిపించింది.

 

హైదరాబాద్‌లో ఆమె కొన్న ఇల్లు గిఫ్ట్‌ అని, అది ఓ రాజకీయ నాయకుడు ఆమెకు బహుమతిగా ఇచ్చాడంటూ తెగ ప్రచారం జరిగింది.  అప్పుడు ఈ రూమర్‌పై నోరు మెదపని రకుల్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో దీనిపై స్పందించింది. ఇటీవల ఆమె ఓ బాలీవుడ్‌ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు తనపై వచ్చిన రూమర్స్‌పై ప్రశ్నించింది. మీపై వచ్చిన రూమర్స్‌లో చెత్త పుకార్‌ ఏంటని హోస్ట్‌ ఆమె ప్రశ్నించారు. దీనికి తనపై వచ్చినవన్ని చెత్త పుకార్లే అని బదులిచ్చింది.

 

అందులో అత్యంత చెత్తది ఏది అనిపించింది అని అడగ్గా.. హైదరాబాద్‌ తన ఇల్లుపై వచ్చినవి నిరాధారమైవి అని తెలిపింది. “హైదరాబాద్‌లో నేను కొన్న ఇల్లు.. ఓ పొలిటిషియన్‌ నాకు గిఫ్ట్‌ ఇచ్చాడంటూ వార్తలు రాశారు. అవి చూసి మా నాన్నకు చాలా ఆగ్రహానికి గురయ్యారు. నా కూతురు కష్టపడి కొన్న ఇంటిని ఎవరో గిఫ్ట్‌ ఇచ్చారు అంటారేంటని ఆయన కోపంతో రగిలిపోయారు. ఎందుకుంటే ఆ ఇంటికి సంబంధించిన పేపర్‌ వర్క్‌ అంతా మా నాన్నే చూసుకున్నారు. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది. దీంతో ఇలాంటి పనికిమాలిన వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాను. కానీ, ఆయన మాత్రం ‘లేదు.. నువ్వు దీనిపై మాట్లాడాల్సిందే.

 

ఈ వార్తలకు రిప్లై ఇవ్వాల్సిందే’ అని అన్నారు. దీంతో ఇలాంటి చెత్త వార్తలను మనం స్పందించాల్సి అవసరం లేదని ఎలాగోల ఆయనకు నచ్చజెప్పాను” అని రకుల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి. కాగా రకుల్‌ కేరటం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, పండగ చెస్కో, కిక్‌ 2, ధృవ, సరైనోడు, రారండోయ్‌ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించింది. చివరిగా ఆమె ఇండియన్‌ 2 సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది.

 

Weirdest rumour about Rakul!😮 | Shubhankar Mishra | Rakul Preet Singh | #shorts

 

Exit mobile version
Skip to toolbar