Site icon Prime9

Rajendra prasad Sorry to Fans: డేవిడ్‌ వార్నర్‌పై సంచలన కామెంట్స్‌ – బహిరంగ క్షమాపణలు కోరిన రాజేంద్ర ప్రసాద్‌

Rajendra prasad Apologies to David warner: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ బహిరంగ క్షమాపణలు కోరారు. రాబిన్‌ హుడ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ చేసిన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటూ అభిమానులను క్షమాపణలు కోరారు. రాబిన్‌ హుడ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన స్టేజ్‌ మాట్లాడుతూ వార్నర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. “రేయ్‌ డేవిడ్‌. వచ్చి క్రికెట్‌ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా. దొంగ ము** కొడకా. నువ్వు మామూలోడివి కాదు రోయ్‌ వార్నర్‌” అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ పై ఫ్యాన్స్ ఫైర్

ఈ వ్యాఖ్యలు ఆయన సరదాకే చేసినా.. ఆయన ఫ్యాన్స్‌ మాత్రం మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న నటుడు స్టార్‌ క్రికెటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ రాజేంద్ర ప్రసాద్‌పై భగ్గమంటున్నారు. దీంతో ఆయన కామెంట్స్‌ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజేంద్రప్రసాద్‌ మతిపోయిందా? అంటూ ఏకిపారేస్తున్నారు. తనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ వివాదానికి చెక్‌ పెట్టేందుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

ఉద్దేశపూర్వకంగా అనలేదు

“నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు దేవుళ్లకు నమస్కారం. రాబిన్‌ హుడ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డేవిడ్‌ వార్నర్‌పై నోటి నుంచి అనుకోకుండ ఓ మాట దోర్లింది. అది ఉద్దేశపూర్వంగా మాట్లాడింది కాదు. నా గురించి మీకు తెలియనిది కాదు. ఈవెంట్‌ కంటే మందు మేమంతా కలిసే ఉన్నాం. ఎంతో సరదాగా గడిపాము. నితిన్‌, వార్నర్‌ను మీరంతా నా పిల్లలాంటి వారు అని అన్నాను. ఆ తర్వాత వార్నర్‌ని హగ్ చేసుకుని ‘నువ్వు యాక్టింగ్‌లోకి వస్తున్నావ్‌గా రా నీ సంగతి చెబుతా’ అన్నాను. ఆ తర్వాత వార్నర్‌ కూడా ‘మీరు క్రికెట్‌లోకి రండి.. మీ సంగతి చెప్తా’ అంటూ ఇద్దరు సరదగా మాట్లాడుకున్నాం. అలా ఈవెంట్‌కి ముందు మేము చాలా క్లోజ్‌ అయ్యాం.

ఇకపై ఈ తప్పు జరగదు

అల్లరి చేశాం. ఐ లవ్‌ వార్నర్‌.. ఐ లవ్‌ క్రికెట్‌. అలాగే వార్నర్‌ లవ్స్‌ అవర్‌ ఫిలీమ్స్‌.. లవ్‌ అవర్‌ యాక్టింగ్. ఏది ఏమైనా జరిగిన మీ మనసుల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ఇవి నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. అయినా కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి ఇంకెప్పుడు జరగదు.. జరగకుండా చూసుకుందాం. మార్చి 28న రాబిన్ హుడ్‌ సినిమా అందరు చూడండి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆయన క్షమాపణలతో అయినా ఈ వివాదానికి సద్దుమణుగుతుందో? లేదో? చూడాలి. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో హాట్‌ బ్యూటీ కేతిక శర్మ స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar