Site icon Prime9

Allu Aravind: అల్లు అరవింద్ కు ఏమైంది.. కేరళలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ?

Allu Aravind: అల్లు అరవింద్.. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కొడుకుగా.. మెగాస్టార్ బావగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రిగా.. ఇవేమి కాకపోతే గీతా ఆర్ట్స్ ఫౌండర్ గా ఆయనకు  ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా.. తన కొడుకును కాపాడుకున్నాడు అరవింద్.

 

ఇక బన్నీ గొడవ నుంచి అరవింద్ ను బయటపడేసింది తండేల్ సినిమా. నాగ చైతన్య- సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ నుంచి సెలబ్రేషన్స్ వరకు అన్ని అల్లు అరవింద్ దగ్గర ఉండి చూసుకున్నాడు. చై కన్నా ఎక్కువగా అల్లు అరవింద్ నే ఎక్కువ కష్టపడ్డాడు అని చెప్పాలి.

 

ఇక సినిమాల గురించి పక్కన పెడితే.. తాజాగా అల్లు అరవింద్  హాస్పిటల్ లో చేరినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. హాస్పిటల్ అంటే ఒక వెల్ నెస్ సెంటర్. కేరళ లోని ఒక ఫేమస్ వెల్ నెస్ సెంటర్ లో అల్లు అరవింద్ నేచురల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన దేనికోసం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.. ? ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారు.. ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Devara 2: అసలు ఉంటుందో.. ఉండదో తెలియదు.. మళ్లీ ఇందులో మరో కొత్త హీరోనా.. ?

ఇక తండేల్ సినిమా తరువాత గీతా ఆర్ట్స్ లో వస్తున్నా మరో పెద్ద మూవీ ఛావా. బాలీవుడ్ ను షేక్ చేసిన ఈ సినిమా తెలుగు హక్కులను బన్నీవాసు కొనుగోలు చేశాడు. ఈ సినిమా మార్చి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో కేవలం బన్నీవాసు మాత్రమే పాల్గొంటున్నాడు.

 

అల్లు అరవింద్ ఈ ప్రమోషన్స్ కు దూరంగా ఉండడానికి కారణం ఆయన హెల్త్ ప్రాబ్లెమ్స్ అని టాక్. ఈ విషయం తెలియడంతో అరవింద్ కు ఏమైందో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ కేరళ వైద్యం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar