Prime9

The Raja Saab Teaser Out: రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. రాజా సాబ్ టీజర్ వచ్చేసింది.. తగలబడిపోతాయ్!

Prabhas The Raja Saab Movie Teaser Out Now: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, సలార్, కల్కి వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొలగొట్టింది.

 

అలాగే కల్కి సినిమా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి సిరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మారుతి డైరెక్షన్‌లో రాజా సాబ్‌గా రానున్నాడు మన ప్రభాస్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజా సాబ్‌లో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు.

 

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ వంటి అందాల భామలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా రాజా సాబ్ టీమ్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ బాబోయ్ రాజా సాబ్ టీజర్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ లుక్స్ మాములుగా లేవు అని అంటున్నారు. ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి అలా చూపించారని చెబుతున్నారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు.

 

టీజర్ చూస్తే.. హారర్ కంటెంట్‌‌తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని అర్ధమవుతుంది. ప్రభాస్‌కు ఇదే మొదటి హారర్ కంటెంట్ ఉన్న సినిమా. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. బాబోయ్ టీజరే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్.

 

The RajaSaab Telugu Teaser | Prabhas | Maruthi | Thaman | TG Vishwa Prasad | Dec 5 2025

 

Exit mobile version
Skip to toolbar