Site icon Prime9

Payal Rajput Emotional Post: స్టార్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Payal Rajput Father Diagnosed With Cancer

Payal Rajput Father Diagnosed With Cancer

Payal Rajputs Father Battling Esophageal Cancer Post Viral: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలోని ఇందు నేమ్ తోనే పాయల్ ను పిలుస్తూ ఉంటారు.

 

ఇక మొదటి సినిమాలాంటి విజయాన్ని అందుకోవడానికి పాయల్ ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో చేసిన పాత్రలే చేస్తూ వచ్చినా అమ్మడికి హిట్ దక్కలేదు. ఆ తరువాత రవితేజ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా విజయం అందుకోలేదు. ఇక మొదటి సినిమాతో మంచి హిట్ ను అందించిన డైరెక్ట అజయ్ భూపతితోనే మంగళవారం అంటూ వచ్చి మరో హిట్ ను అందుకుంది.

 

ప్రస్తుతం పాయల్  మంగళవారం 2 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో కూడా పాయల్ నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా పాయల్.. తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలుపుతూ తన తండ్రి కోలుకోవడానికి అందరూ ప్రార్ధించమని కోరింది.

 

“నా తండ్రికి ఇటీవల అన్నవాహిక క్యాన్సర్ (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మేము కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు ఆయనకు మొదటి కీమోథెరపీ సెషన్. నేను ముందుకు సాగుతున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొంచెం భయపడుతున్నాను, కానీ అది అవసరమని మాకు తెలుసు. నాన్న బలంగా ఉన్నారు. ఆయన కోలుకోవాలని నిశ్చయించుకున్నారు.

 

ఈ సవాలుతో కూడిన సమయంలో కూడా, నాన్నగారు నన్ను పని చేస్తూనే ఉండమని, నా షూటింగ్‌లు మరియు ఈవెంట్‌లకు తిరిగి వెళ్లాలని ప్రోత్సహిస్తున్నారు. నేను ఈ కష్టతరమైన ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఈ అప్‌డేట్‌ను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. మీ ప్రేమ, మద్దతు మరియు సానుకూల వైబ్‌లు ప్రస్తుతం మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము.  క్యాన్సర్‌తో జరిగే ఈ యుద్ధాన్ని కలిసి ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఆశీర్వాదం కూడా ముఖ్యమైనది” అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు పాయల్ తండ్రి కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar