Site icon Prime9

Jaat Movie: శ్రీరామ నవమి స్పెషల్.. జాట్ నుంచి రాముడి సాంగ్ రిలీజ్

jaat song

jaat song

Jaat Movie: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాట్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కాసాండ్రా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రణదీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి రాముడి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఓ రామ.. శ్రీరామ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు అద్వితీయ వొజ్జల, శృతి రంజని సాహిత్యం అందించగా.. ధనుంజయ్ సీపాన, సాకేత్, సుమానస్, సాత్విక్, వాగ్దేవి ఎంతో అద్భుతంగా ఆలపించారు.

 

ఇక వీడియోలో భక్తుల మధ్య సన్నీ డియోల్ హీరోగా నడుచుకుంటూ వచ్చి డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సాంగ్ తో సినిమాపై హైప్ పెరిగింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ మలినేని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Oh Rama Shri Rama | JAAT | Sunny Deol | Randeep Hooda I Viineet Kumar| Gopichand Malineni | Thaman S

Exit mobile version
Skip to toolbar