Oh Bhama Ayyo Rama: కుర్ర హీరో సుహాస్ హీరోగా రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ భామ అయ్యో రామ. వి ఆర్ట్స్ బ్యానర్ పై హర్ష నల్లా నిర్మిస్తున్న చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఓ భామ అయ్యో రామ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రేమించిన అమ్మాయి అందాన్ని ఒకపక్క పొగుడుతూ.. ఆమె రావడంతో అతని జీవితంలో వచ్చిన భయాలను హీరో చెప్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. శ్రీ హర్ష ఈమని లిరిక్స్ అందించగా.. రాధన్ మ్యూజిక్ అందించాడు. ఇక శరత్ సంతోష్ తన గాత్రంతో సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు.
సుహాస్, మాళవిక ఫెయిర్ చాలా బావుంది. జో సినిమాతో మాళవిక తెలుగువారికి దగ్గరయింది. ఆ సినిమాలో ఎంతో సైలెంట్ గా.. పద్దతిగా కనిపించిన మాళవిక.. ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్ తో పాటు ఆటిట్యూడ్ కూడా చూపించినట్లు కనిపిస్తుంది. ఇక సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. గతేడాది రెండు చిన్న సినిమాలతో వచ్చినా.. అవేమి ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. ప్రస్తుతం సుహాస్ ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.