Site icon Prime9

Abhinav Singh: ప్రముఖ సింగర్‌ ఆత్మహత్య – భార్య వేధింపులే కారణమా?

Singer Abhinav Singh Commit Suicide: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సింగర్‌, ర్యాపర్‌ అభినవ్‌ సింగ్‌(32) ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి బలవ్మరణానికి పాల్పడ్డాడు. అభినవ్‌ మృతితో ఒడిశా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అతడి మరణంలోపై ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, పలువురు గాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంట భార్య వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు అభినవ్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమని సింగర్‌ అభినవ్‌ తండ్రి బిజయ్‌ నందా సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభినవ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. భార్య వేధింపుల వల్ల మరణించాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నరు. కాగా ఒడిశాకు సింగర్‌ అయిన అభినవ్‌ కథక్‌, ఆంథెమ్ సాంగ్‌తో పాపులర్‌ అయ్యాడు. ర్యాప్‌ సింగర్‌గా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అతడు అర్భన్‌ లోఫర్‌ అనే మొదటి హిట్‌ హాప్‌ లేబుల్‌ను స్థాపించాడు.

Exit mobile version
Skip to toolbar