Prime9

Naga Chaitanya New Look: రగ్గడ్‌ నుంచి స్టైలిష్‌గా.. నాగచైతన్య లేటెస్ట్‌ లుక్‌ చూశారా? ఏమున్నాడు కదా..

Akkineni Naga Chaitanya Latest look Video Goes Viral: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత అక్కినేని హీరో, యువ సామ్రాట్‌ నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఆయన నటించిన ‘తండేల్‌’ మూవీ సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టడేమే కాదు.. రూ. 100 కోట్ల గ్రాస్‌ క్రాస్‌ చేసింది. తండేల్‌ బ్లాక్‌బస్టర్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు నాగచైతన్య. ఇక అదే జోష్‌లో తన నెక్ట్స్‌ మూవీ ఎన్‌సీ23(NC24) మూవీపై ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా సంబంధించని పనులను కూడా స్టార్ట్‌ చేశాడు. తాజాగా చై హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. చూస్తుంటే NC24 కోసమే అతడు హైదరాబాద్‌ నుంచి వెళుతున్నట్టు తెలుస్తొంది.

 

చై లుక్కి ఫ్యాన్స్ ఫిదా

ఈ సందర్భంగా అతడి లుక్‌ చూసి అభిమానులు, నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. కొత్త హెయిర్‌ స్టైల్‌తో స్టైలిష్‌ లుక్‌లో ఫిదా చేశాడు. తండేల్‌ కోసం మొన్నటి వరకు రగ్గడ్‌ లుక్‌లో ఉన్న చై.. తాజాగా అల్ట్రా సైలిష్‌ లుక్‌లో కనిపించాడు. చూస్తుంటే ఈ కొత్త లుక్‌ NC24లోనిదేమో అనిపిస్తుంది. ఈ సినిమా కోసమే వెళుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చైని ఇలా చూసి అక్కినేని ఫ్యాన్స్‌ అంతా తెగ మురిసిపోతున్నాడు. ఏమున్నాడ్రా బాబూ అంటూ లేడీ ఫ్యాన్స్‌ చెవులు కొరుకుంటున్నారు. విరూపాక్ష ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకుని మూవీ లాంచ్‌కి రెడీ అవుతుంది.

 

NC24  కోసం అల్ట్రా స్టైలిష్ గా..

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ వస్తుంది. విరూపాక్ష లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత కార్తిక్‌ దండు చేస్తున్న చిత్రమిది. దీంతో ప్రకటనతోనే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్‌ మూవీపై మరింత బజ్‌ పెంచింది. మైథాలాజికల్‌ మిస్టరీ థ్రిల్లింగ్‌ జానర్‌లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. NC24 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దీనిని ప్రకటించారు. ఇందులో చై ఇదివరకు ఎన్నడు చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడట. ఇప్పటికీ లవర్‌ బాయ్‌ తరహా కనిపించిన ఈ యువ సామ్రాట్‌ ఇందులో ఊరమాస్‌లో ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తాడని, ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేసింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా సంయుక్తంగా తెరకెక్కుతోంది. అంజనీస్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar