Nandamuri Hero: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకడు. విజయాపజయాలను లెక్కచేయకుండా సక్సెస్ ను అందుకొని నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కు మంచి జోష్ ను అందించింది. దీని తరువాత మరో రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. ఇక హీరోగా చేస్తూనే.. ఇంకోపక్క నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. గతేడాది దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతి ప్రమోషన్ కంటెంట్ లో కళ్యాణ్ రామ్.. విజయశాంతిని అంటిపెట్టుకొనే ఉంటున్నాడు. అమ్మా.. అమ్మా అంటూ సొంత కొడుకులానే నడుచుకుంటున్నాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బిహేవియర్ కొద్దిగా అతి అయ్యిందనినెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తన బాబాయ్ తో నటించిన హీరోయిన్ కాబట్టి, అందులోనూ తన సినిమాలో తల్లిగా నటిస్తుంది కాబట్టి గౌరవం, ప్రేమ ఉండడం సహజమే కానీ.. ఆమె మరీ అంత నడవలేని పరిస్థితిలో అయితే లేదు. ప్రతిసారి విజయశంతో చెయ్యి పట్టుకొని నడిపించాల్సిన అవసరం లేదు. స్టేజిపైనే కాదు.. బయట కూడా కళ్యాణ్ రామ్.. విజయశాంతి చెయ్యి పట్టుకొని ఒక్కో అడుగు వేయిస్తున్నట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు యాక్టింగ్ చేయ్.. ఓవర్ యాక్టింగ్ వద్దు, సినిమాలో నటించు.. బయట కాదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.