Site icon Prime9

Thandel: ఓవర్సిస్‌లో అదరగొడుతున్న ‘తండేల్‌’ మూవీ – ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే!

Thandel Movie

Thandel Movie

Thandel Movie US Collections: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్‌ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. పాటలు, మ్యూజిక్‌తో తండేల్‌పై మంచి బజ్‌ నెలకొంది. అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుని హిట్‌ ట్రాక్‌లో పడింది. అప్పుడే మూవీ టీం కూడా సబ్బరాలు చేసుకుంటుంది. తొలిరోజు ఈ సినిమాకు ఆడియన్స్‌ను నుంచి విశేష స్పందన వస్తోంది.

ఫస్ట్‌డే ఈ మూవీ భారీ వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచన వేస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్‌ హయ్యొస్ట్‌ గ్రాస్‌ అని సమాచారం. ముఖ్యంగా ఓవర్సిస్‌లో తండేల్‌ అదరగొడుతోంది. ఫస్ట్‌ డే ఈ సినిమా అక్కడ భారీ ఓపెనింగ్‌ ఇచ్చింది. తొలి రోజు ఈ సినిమా 400k డాలర్లు వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా నిర్మాణ సంస్థ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీనికి ‘అలలు మరింత బలపడుతున్నాయి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక తొలిరోజు ఓవరాల్‌ కలెక్షన్స్‌కి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది.

కాగా బుక్‌ మై షోను తండేల్‌ మూవీ యమ జోరు చూపిస్తోంది. టికెట్స్‌ ఒపెన్‌ అయిన 24 గంట్లోనే 2 లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయి. దీంతో తండేల్‌ మూవీ బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో నిలిచినట్టు మూవీ టీం తెలిపింది. ఈ సినిమాలోని సాయి పల్లవి, నాగ చైతన్యల మధ్య ఉన్న భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోసారి వెండితెర వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ వస్తోంది. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్యలు నటించి రెండవ చిత్రమైన తండేల్‌ హిట్‌ అవ్వడంతో వీరి పెయిర్‌కు ఫుల్‌ క్రేజ్‌ వస్తోంది.

Exit mobile version
Skip to toolbar