Site icon Prime9

Actor Bala: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ నటుడు – మాజీ భార్య వేధిస్తోందని ఫిర్యాదు

Actor Bala Filed Complaint Against His Ex Wife: మలయాళ నటుడు, డైరెక్టర్‌ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాతో తనపై తన భార్య కోకిలపై దుష్ప్రచారం చేయిస్తుందని కొచ్చి సిటీ పోలీస్‌ కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నటుడు బాలా తన మొదటి భార్య ఎలిజబెత్‌ ఉదయన్‌ 2023లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఎలిజబెత్‌ ఇటీవల బాలాను రూ. 50 లక్షలు డిమాండ్‌ చేసిందని, ఇవ్వకపోవడంతో యూట్యూబర్‌ అజు అలెక్స్‌తో కలిసి తనపై సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేయిస్తోందని పోలీసుల ఫిర్యాదు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో అజు అలెక్స్‌ యూట్యూబ్‌ ఛానళ్లో తనపై అభ్యంతకరమైన వీడియోలు పోస్టు చేయడం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 8, 2023లోనే తాను, ఎలిజబెత్‌ విడిపోయామని బాలా పోలీసులకు స్పష్టం చేశాడు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.

ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడారు. “సోషల్‌ మీడియాలో కొందరు కావాలని నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఓ మహిళపై నేను అత్యాచారానికి పాల్పడ్డానంట నాపై తప్పుడు ప్రచారం చేస్తూ నా ప్రతిష్ట దెబ్బ తినేలా చేస్తున్నారు. ఏడాదిన్నర పాటు ఒక మహిళలపై నేను అత్యాచారాం ఎలా చేయగలను. ఇదో వెబ్‌ సిరీస్‌లా సాగుతోంది. నేను ఏమైన రేపిస్టునా? రీసెంట్‌గానే నాకు సర్జరీ జరిగింది. ఆ టైంలో నా మాజీ భార్య ఎలిజబెత్ ఎక్కడుందో కూడా తెలియదు, ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది” అంటూ బాలా వాపోయాడు.

Exit mobile version
Skip to toolbar