Prime9

Narne Nithin First Movie: ఎట్టకేలకు నార్నే నితిన్‌ ఫస్ట్‌ మూవీ రిలీజ్‌ – శ్రీశ్రీశ్రీ రాజావారు వచ్చేస్తున్నారు..

Narne Nithin First Movie Sri Sri Sri Rajavaru Release on June 6th: యంగ్‌ టైరగ్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ ప్రస్తుతం హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మ్యాడ్‌ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఎంట్రీతోనే హాట్రిక్‌ హిట్‌ కొట్టిన నార్నే నితిన్‌ ఫుల్‌ జోష్‌లో దూసుకుపోతున్నాడు. నిజానికి నితిన్‌ మ్యాడ్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు నటించిన తొలి చిత్రం మాత్రం ఇది కాదు. అతడు నటించి మొట్టమొదటి సినిమా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. అయితే ఇప్పుడు ఈ సినిమ విడుదలకు సిద్ధమైంది. అతడు హీరో డెబ్యూ ఇచ్చిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.

 

ప్రస్తుతం నితిన్‌ ఉన్న క్రేజ్‌, గుర్తింపు నేపథ్యంలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్‌ ముందుకు వచ్చారు. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్‌ వేగేశ్న రూపొందించిన ఈ సినిమాలో సంహిత హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా జూన్‌ 6న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, ప్రవీణ్, రచ్చ రవి, రఘు కుంచె, సరయు, రమ్య, ప్రియ జబర్దస్త్ నాగి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలను శ్రీమణి రాయగా, కైలాష్ మీనన్ సంగీతం అందించారు.

Exit mobile version
Skip to toolbar