Tillu Cube Director Fix: ఈ మధ్య టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాలకు కొనసాగింపుగా సీక్వెల్స్‌ని తీసుకువస్తున్నారు. అలా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అదే టీం, అదే హీరో, అదే డైరెక్టర్‌తో సీక్వెల్స్ వస్తుంటాయి. కానీ డిజే టిల్లు విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సీక్వెల్, సీక్వెల్‌కి డైరెక్టర్ మారుతున్నాడు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా పరిచయమైన చిత్రం ‘డిజే టిల్లు’.
ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ కథ, స్క్రిన్‌ప్లే అందించిని ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం. ఇందులో సిద్దు డైలాగ్ డెలివరి, మ్యానరిజం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సిద్దు స్టార్ బాయ్‌గా మారిపోయాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ని తీసుకువచ్చారు. ఇది ఫస్ట్ పార్ట్ మించి హిట్ అయ్యింది.
అయితే డైరెక్టర్ విమల్ స్థానంలో మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ మారిన మూవీ మాత్రం అదే రేంజ్‌లో ఆడియన్స్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దీనికి పార్ట్ 3 కూడా రాబోతోంది. టిల్లు క్యూబ్‌గా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కూడా డైరెక్టర్ మారాడు. మల్లిక్ రామ్ స్థానంలో కళ్యాణ్ శంకర్ వచ్చాడు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రెస్‌మీట్ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. టిల్లు క్యూబ్‌కు కల్యాణ్ శంకర్ దర్శకుడు అని వెల్లడించాడు. దీంతో టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరనేది కన్‌ఫాం అయ్యింది.