Prime9

Rishab Shetty: ‘కాంతార చాప్టర్‌ 1’టీంను వెంటాడుతున్న ప్రమాదాలు.. రిషబ్‌ శెట్టికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Kantara Chapter 1 team escpad from Boat Capsizes During Shoot: కన్నడ దర్శకుడు, కాంతార ఫేం రిషబ్‌ శెట్టికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాంతార: చాప్టర్‌ 1’ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2022లో విడుదలైన కాంతారకు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై వచ్చినప్పటి నుంచి కాంతార సెట్లో వరుస ప్రమాదాలు, విషాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజులు క్రితమే ఈ సినిమాలోని నటుడు మరణించాడు.

 

ఇప్పుడు ఏకంగా ఈ సినిమా హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టిలో ప్రమాదంలో పడ్డారు. అయితే ఈ సంఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం కాంతార: చాప్టర్‌ 1 షూటింగ్‌ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. షూటింగ్‌ కోసం కాంతార టీంలోని 30 మంది కళాకారులతో శనివారం సాయంత్రం పడవలో ప్రయాణిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఈ పడవ నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో రిషబ్‌ శెట్టి కూడా పడవలోనే ఉన్నట్టు సమాచారం.

 

అయితే వారంత ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారట. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, కెమెరాతో పాటు పలు సాంకేతిక పరికరాలు నీటి పాలయ్యాయి. గతంలో కాంతార శెట్‌లో పలుమార్లు ప్రమాదం జరిగింది. గతేడాది జూనియర్‌ ఆర్టిస్టులతో వస్తున్న బస్సు బోల్తా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. ఇక కాంతర షూటింగ్‌ టైంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో ముగ్గురు జూనియర్‌ ఆర్టిస్టులు మరణించారు. రెండు రోజులు క్రితం ఈ సినిమాకు పని చేస్తున్న మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు కళాభవన్‌ మృతి చెందారు.

 

అంతకు ముందు ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు వివిధ ప్రమాదాల్లో మరణించారు. ఇలా కాంతార: చాప్టర్‌ 1 మూవీని వరుస విషాదాలు, ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి కూడా ఉండటంతో అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2022లో విడుదలైన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్‌గా ఇది తెరకెక్కుతుంది. రిషబ్‌ శెట్టి నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. హోంబాలే ఫిల్మ్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

 

Exit mobile version
Skip to toolbar