Prime9

Kamal Haasan Scolds Fan: కత్తి బహుకరించిన అభిమాని.. అసహనంతో ఊగిపోయిన కమల్‌.. వీడియో వైరల్‌!

Kamal Haasan Fires on Fan Who Gifted Sword: ఉలగనాయకన్‌ కమల్‌ హాసన్‌ ఓ అభిమానిపై ఆగ్రహానికి గురయ్యారు. ఓ సమావేశంలో ఓ వ్యక్తి అత్యూత్సాహం ప్రదర్శించారు. అది ఆయనకు అసహనం తెప్పించింది. దీంతో స్టేజ్‌పైనే అతడిపై మండిపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా కమల్‌ హాసన్‌ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన చిత్రం థగ్‌ లైఫ్‌ ప్రమోషనల్‌ కార్యక్రమంలో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

 

తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్న కామెంట్స్‌ కన్నడనాట సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలు కన్నడీగులు, అధికార, విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్‌ వచ్చాయి. ఈ దెబ్బతో ఆయన థగ్‌ లైఫ్‌ మూవీ కర్ణాటకలో విడుదల కాకుండ నిషేధం విధించారు. ఈ వివాదం కాస్తా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ తాజాగా పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కమల్‌ మక్కల్‌ నీది మయ్యం (MNM)పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

 

తాజాగా చెన్నైలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు వేదికపై వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని మరీ అత్యుత్సాహం పరదర్శించాడు. పార్టీ మీటింగ్‌ సంద్భంగా ఫ్యాన్స్‌ తమకు తోచిన బహుమతులను కమల్‌కు సమర్పిస్తున్నారు. అలాగే ఓ అభిమాని ఏకంగా కత్తిని బహుకరించాడు. కమల్‌ దానిని అందుకున్నారు. కానీ, ఈ అభిమాని మాత్రం దానిని పైకెత్తి పట్టుకోవాలని కోరాడు. దీనికి ఆయన నిరాకరించాడు. కానీ, అతడు మాత్రం అదే పనిగా కమల్‌ని బలవంతం చేస్తున్నారు. అంతేకాదు ఆయన చేతిని పట్టుకుని కత్తిని పైకి లేపాలంటూ బలవంతం చేశాడు.

 

అప్పటి వరకు సహనంతో ఉన్న కమల్‌ హాసన్‌ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. కత్తి కింద పెట్టాలని కళ్లు పెద్దవిగా చేసి వారించారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ వెంటనే జోక్యం చేసుకుని అభిమానితో కత్తి కింద పెట్టేలా చేశారు. ఆ తర్వాత కూల్‌ అయిన కమల్‌.. సదరు వ్యక్తికి నవ్వుతూ కరచాలనం చేసి అక్కడి నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇందులో కమల్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు. ఆయనకు అంత అసహనం తెప్పించిన అభిమాని తీరును నెటిజన్స్‌ తప్పుబడుతున్నారు. అభిమానం ఉండోచ్చు.. కానీ అది వారికి ఇబ్బంది అయ్యేంత ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar