NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏపీలో సందడి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నందమూరి ఫ్యామిలీ ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్, తల్లి షాలిని, భార్య ప్రణతీ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.
ఎన్టీఆర్ కుటుంబానికి ఆస్థాన పండితుడు అయిన కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె గాయత్రీ వివాహం.. అఖిల్ తో ఈరోజు ఒక కల్యాణమండపంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఎన్టీఆర్ కుటుంబం రావడం హైలైట్ గా మారింది.నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని, ప్రణతీ ఈ పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్ హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో అన్న వచ్చాడు.. తమ్ముడు ఎక్కడ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నందమూరి కుటుంబం మొత్తం ఒకే చోట ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ కూడా ఉంటే బావుండేది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దేవర తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు వార్ 2, డ్రాగన్. వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
Dilruba Trailer: దిల్ రుబా ట్రైలర్.. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా.. ?
వార్ 2 కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది. దీనికోసం ఎన్టీఆర్ పూర్తిగా లుక్ మార్చనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమా షూటింగ్స్ లోనే ఎన్టీఆర్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ రెండు కాకుండా దేవర 2 కూడా ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో దేవరపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఆ అంచనాల వరకు ఎన్టీఆర్ వెళ్లలేకపోయినా.. జక్కన్న సెంటిమెంట్ నుంచి మాత్రం బయటపడ్డాడని చెప్పొచ్చు. ఇక త్వరలోనే దేవర 2 కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.