Site icon Prime9

Dhamaka : 10 రోజుల్లో రూ. 89 కోట్లు వసూలు చేసిన ’ధమాకా ‘

Dhamaka

Dhamaka

Dhamaka : త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ డ్రామా ధమాకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది మరియు విడుదల రోజున సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకుపోతోంది.మొదటి వారంలో భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారాంతంలో అదే జోరు కొనసాగిస్తోంది.

తాజా నివేదిక ప్రకారం, రవితేజ నటించిన ధమాకా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 89 కోట్ల గ్రాస్ సంపాదించింది. ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ హ్యాండిల్‌లో కొత్త పోస్టర్‌ను షేర్ చేయడం ద్వారా అధికారికంగా ధృవీకరించింది.ఈ సినిమా త్వరలో 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. USAలో, ఈ చిత్రం $500K మార్కును దాటింది. ధమాకా ఏపీ మరియు తెలంగాణలో వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టింది, అవతార్ మరియు సర్కస్ తర్వాత భారతదేశంలో ఇది మూడవ అతిపెద్ద వసూళ్లు కావడం విశేషం.

రవితేజ నటన, అతని డైలాగ్ డెలివరీ మరియు స్టైల్ ఈ యాక్షన్‌ మూవీకి మంచి ఊపు తేగా మాస్ పాటలు, శ్రీలీల డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. . ధమాకా థియేట్రికల్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21 కోట్లకు అమ్ముడయ్యాయి.

Exit mobile version