Site icon Prime9

Black Adam Movie: బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న “బ్లాక్ ఆడమ్”

black adam movie collections

black adam movie collections

Black Adam Movie: ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ నటించిన “బ్లాక్ ఆడమ్” అక్టోబర్ 21 శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద విడుదలయిన విషయం తెలిసిందే. కాగా డ్వేన్ జాన్సన్, DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ కోసం ఈ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. “బ్లాక్ ఆడమ్” చిత్రం 5,000 సంవత్సరాల తర్వాత సమాధి నుండి విముక్తి పొందిన ఒక వ్యతిరేక హీరో యొక్క కథ. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కనక వర్షం కురిపిస్తుంది.

దీపావళికి ముందుగానే ఇండియా బాక్సాఫీస్ వద్ద “బ్లాక్ ఆడమ్” విడుదలైనందున, థియేటర్లలో జనసంద్రం తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా కలెక్షన్‌పై కాస్త ప్రతికూల ప్రభావం కనిపించింది. బాక్స్ ఆఫీస్ ఇండియా ప్రకారం, మొదటిరోజు ఈ చిత్రం 6-7 కోట్ల మార్క్‌ను చేరుకుంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి తర్వాత హాలీవుడ్‌లో ఉత్తమ ఓపెనింగ్‌ సినిమాలలో ఇదీ ఒకటిని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: సరికొత్తగా “బ్లాక్ పాంథర్” వచ్చేస్తుంది.. నవంబర్ 11న “వకాండా ఫరెవర్” సందడి

Exit mobile version