Site icon Prime9

Hollywood: హ్యారీపోటర్ నటుడు రాబీ కోల్ట్రేవ్ మృతి

robbie coltrane passed away

robbie coltrane passed away

Hollywood: హాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రేన్‌ కన్నుమూశారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ట్రేన్‌ సుపరిచితుడే. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలైన హ్యారీపోటర్‌ సిరీస్లో రాబీ కోల్ట్రేన్ హాగ్రిడ్‌ అనే ముఖ్య పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన రాబీ కోల్ట్రేన్‌ ఫ్లాష్‌ గార్డాన్‌ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. హ్యారీ పోటర్‌ సిరీస్‌కు ముందు రాబీ కోల్ట్రేన్ 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్‌లో హార్డ్-బీటెన్‌ డిటెక్టీవ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటితో పాటుగా జేబ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాల్లో ఈయన నటించి ప్రజలను మెప్పించారు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా బాఫ్టా( British Academy Television Awards) అవార్డులను సాధించాడు. కాగా ఈయన స్కాట్లాండ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మరణానికి కారణాలేంటో తెలియదు కాని రాబీ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇదీ చదవండి: బాలీవుడ్ భామల కర్వాచౌత్ వేడుకలు చూద్దామా..!

Exit mobile version